Makhana: ఫూల్‌ మఖానా తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త ?


Makhana: మఖానా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. మఖానాలో ముఖ్యంగా ప్రోటీన్లు, ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మఖానాను చాలా రకాలుగా వాడుకోవచ్చు. కూర చేసుకోవచ్చు స్నాక్స్ రూపంలో తినవచ్చు మఖానాతో పాయసం కూడా చేసుకోవచ్చు. ఇది ఏ రకంగా తిన్నా సరే ఆరోగ్యానికి చాలా మంచిది.

Makhana Health Benefits

డయాబెటిస్ ఉన్నవారు కూడా మఖానాను తప్పకుండా తినాలి. కనీసం వారంలో రెండు సార్లు అయినా ఇది తిన్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. మఖానాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది చాలా సేపు కడుపు నిండుగా ఉండడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. దానివల్ల సులభంగా బరువు తగ్గుతారు. మఖాన గుండె సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ సమస్యలను నయం చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగాను, కేలరీలు తక్కువగాను ఉంటాయి. మఖానాలో పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది.

Congress: గూడెం మహిపాల్ రెడ్డిపై కాంగ్రెస్ వేటు?

ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. ఇందులో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలను బలంగా, దృఢంగా తయారు చేస్తుంది. ఎన్నో రకాల పోషకాలు ఉండే మఖానాను ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ రూపంలో తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మఖానాలో ఒత్తిడిని తగ్గించే గుణం అధికంగా ఉంటుంది. దానివల్ల మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే ప్రతి ఒక్కరు వారంలో రెండు మూడు సార్లైనా మఖానను తప్పకుండా తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *