Manchu Manoj: సినిమాలకు గుడ్ బై..ఆ పార్టీలోకి మంచు మనోజ్.. 1000 కార్లతో ర్యాలీ..?
Manchu Manoj: మంచు మనోజ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్న పేరు.. ఈయన మోహన్ బాబుతో గొడవలు నేపద్యంలో సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో హైలెట్ గా నిలుస్తున్నారు. అయితే కొంతమంది ఏమో మంచు మనోజ్ కి మద్దతుగా నిలుస్తుంటే మరి కొంతమంది ఏమో మోహన్ బాబు వైపు ఉంటున్నారు.
Manchu Manoj enter to the Politics
ఏది ఏమైనప్పటికీ ఇంట్లో ఉండే గొడవలు రోడ్డుమీదికి వచ్చి మంచు ఫ్యామిలీ పరువు మొత్తం బజారున పడింది. అయితే సినిమాలు చేసుకొని హ్యాపీగా ఉండక ఈ గొడవ ఏంటి అని కొంతమంది వాదన. అయితే తాజాగా మంచు మనోజ్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. (Manchu Manoj)
Also Read: Manoj: అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన పంచదార.. మళ్లీ పోలీస్ స్టేషన్ కి మనోజ్.?
మరి ఇంతకీ మంచు మనోజ్ ఏ పార్టీలోకి వెళ్తున్నారయ్యా అంటే.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డి పోతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు అనగా సోమవారం డిసెంబర్ 16న భూమ మౌనిక రెడ్డి తల్లిదండ్రులు అయినటువంటి భూమ శోభా రెడ్డి భూమా నాగిరెడ్డిల జయంతి.. వీరి జయంతి సందర్భంగా ఆళ్లగడ్డకు వెళ్లి అక్కడ ఒక పెద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఆళ్లగడ్డకు మనోజ్ మౌనిక ఇద్దరూ 1000 కార్లతో భారీ ర్యాలీ తీయబోతున్న తెలుస్తోంది.ఇక ఈ ప్రెస్ మీట్ లో మంచు మనోజ్ మౌనికలు రాజకీయ రంగప్రవేశం గురించి మాట్లాడబోతున్నారని వీరిద్దరూ దజనసేన లోకి వెళ్తున్నట్టు అధికారికంగా ప్రకటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.మరి చూడాలి మంచు మనోజ్ మౌనికలు జనసేనలోకి వెళ్తున్నారు అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో.(Manchu Manoj)