Manchu Mohan Babu: పిచ్చ కొట్టుడు కొట్టుకున్న మంచు మనోజ్ మోహన్ బాబు .. పోలీస్ స్టేషన్లో కేసు.?
Manchu Mohan Babu: మంచు ఫ్యామిలీ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం వీరి మధ్య ఉన్న విభేదాలు.. ఈ విభేదాల కారణంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే తాజాగా మంచు ఫ్యామిలీ పై మరొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే.. మంచు మోహన్ బాబు తన చిన్న కొడుకు మంచు మనోజ్ ఇద్దరు కొట్టుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టుకున్నట్టు సమాచారం.

Manchu Mohan Babu who was beaten by Manchu Manoj
ఇక విషయంలోకి వెళ్తే.. గత కొద్ది రోజుల నుండి మంచు మనోజ్ విష్ణు కి పడడం లేదు అనే సంగతి మనకు తెలిసిందే. ఆ మధ్యకాలంలో విష్ణు మనోజ్ సన్నిహితులపై దాడి చేసిన వీడియో మనోజ్ ఫేస్బుక్లో షేర్ చేశారు.ఆ తర్వాత అది ఓ రియాల్టీ షో కోసం అని విష్ణు కవర్ చేసినప్పటికీ అది కవర్ కాలేదు. అలాగే మంచు మనోజ్ తనకి పుట్టిన బిడ్డ బారసాల ఫంక్షన్ కి కూడా విష్ణు దంపతులను పిలవలేదు. (Manchu Mohan Babu)
Also Read: Tamannaah and Vijay Varma: త్వరలోనే తమన్నా పెళ్లి.. ముంబై లో ఇల్లు కోసం వేట!!
దీంతో వీరి మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. అయితే తాజాగా మోహన్ బాబు మంచు మనోజ్ ఇంటికి వెళ్లి మరీ కొడుకు కోడల్ని కొట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయంలో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి నాపైన నా భార్యపైనా మోహన్ బాబు దాడి చేశారంటూ కేసు పెట్టారట. ఇక మోహన్ బాబు కూడా తగ్గేదేలే అన్నట్లు నా ఇంటికి వచ్చి మనోజ్ నాపై దాడి చేశాడు అంటూ కేసు పెట్టినట్టు తెలుస్తుంది. దీంతో ఈ ఇద్దరు కొట్టుకున్న విషయం కేసు పెట్టిన విషయం టాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే గత కొద్ది రోజుల నుండి వీరి ఇంట్లో ఆస్తులు పంపకాలపై గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అలాగే వీరికి విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. ఆ విద్య సంస్థలు, ఆస్తుల పంపకాల విషయంలో ఇద్దరు కొడుకులకు తండ్రికి గొడవ జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అలాగే గొడవలు లోలోపల కాకుండా బయటికి రావడంతో టాలీవుడ్ లో ప్రస్తుతం వీరి గొడవ, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. మరి ఈ గొడవలపై మంచు ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.(Manchu Mohan Babu)