Manchu Vishnu: 200 కోట్లు ఇచ్చి ఆస్కార్.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డుపై మంచు విష్ణు కాంట్రవర్సీ కామెంట్స్.?

Manchu Vishnu: మంచు విష్ణు ఎప్పటికప్పుడు కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ అలాగే ఫ్యామిలీ వివాదాల ద్వారా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.ఇక వీరి కుటుంబ పంచాయతీ ద్వారా ఈయన కన్నప్ప మూవీకి కూడా మంచి ప్రమోషన్ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు.ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో విడుదల కాబోతున్న కన్నప్ప మూవీకి సంబంధించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఆస్కార్ అవార్డుపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.
Manchu Vishnu controversial comments on Oscar award
మంచు విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప మూవీకి సంబంధించి ఏ అప్డేట్ రిలీజ్ అయినా కూడా దానికి తెలుగులోనే 20% నెగెటివిటీ వస్తుంది. ఇతర ఇండస్ట్రీలో ఎలాంటి నెగటివిటీ రావడం లేదు. మన తెలుగు వాళ్ళు ఎందుకో పనిగట్టుకొని మరీ సినిమాలనే తొక్కేయాలని చూస్తున్నారు. రాజమౌళి లాంటి డైరెక్టర్లకే ఇది తప్పలేదు.(Manchu Vishnu)
Also Read: Soundarya: ఆ డైరెక్టర్ కాపురంలో చిచ్చు పెట్టిన సౌందర్య..?
ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు వస్తే చాలామంది నెగటివ్ కామెంట్లు చేశారు. ఆ అవార్డు అందుకొని గర్వంగా ఇండియాకి వస్తే 200 కోట్లు ఇస్తే అవార్డు ఎందుకు రాదు అంటూ మాట్లాడారు. అలాగే ఏదైనా సినిమా విడుదలయితే చాలు అందులో ఈకలు తోకలు అంటూ ఎన్నో వెతుకుతూ ఉంటారు. కానీ ఇతర ఇండస్ట్రీలో వాళ్ళు మాత్రం ఇలా చూడరు.

మన తెలుగు వాళ్లే మన సినిమాను తొక్కాలని చూస్తున్నారు. నేను 200 కోట్లు ఇస్తాను కన్నప్ప మూవీకి ఆస్కార్ అవార్డు ఇప్పిస్తారా.. తెలుగు వాళ్ళు అలాంటి అచీవ్మెంట్స్ సాధిస్తే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అని గర్వపడాలి తప్ప నెగిటివ్ కామెంట్లు చేయొద్దు అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు.(Manchu Vishnu)