Manchu vishnu: రాజకీయాల్లోకి మంచు విష్ణు..280 మంది ఎమ్మెల్యేలతో కొత్త పార్టీ.?


Manchu Vishnu enters politics

Manchu Vishnu: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యామిలీలో మంచు ఫ్యామిలీ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే మంచు మనోజ్, మంచు విష్ణు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్న స్టార్ హీరోలుగా మాత్రం ఎదగలేదు. ఒక్క హిట్ కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తాజాగా ఈయన కన్నప్ప అనే చిత్రం ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో మన ముందుకు రాబోతున్నాడు.

Manchu Vishnu enters politics

అయితే ఈ మూవీ అద్భుతమైన కథాంశంతో భారీ తారాగణంతో తీశారట. ఈ సినిమాకు మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించి దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్ సమర్పించారని సమాచారం. అయితే ఈ సినిమాకు మరో స్పెషల్ ఏంటంటే ఇందులో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు నటించబోతున్నారట. (Manchu Vishnu)

Also Read: Mohan Babu: మోహన్ బాబు కి వార్నింగ్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్..అంత అవమానమా..?

తొందరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి మంచు విష్ణు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ తరుణంలోనే ఆయన ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. సినిమా గురించి కాకుండా పొలిటికల్ కు సంబంధించిన కామెంట్స్ చేశారు.. మంచు విష్ణుకు మొత్తం 200 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారట..

Manchu Vishnu enters politics

తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలలో 100మంది తనకు చాలా క్లోజ్ అని తమిళనాడులో 20 మంది ఆంధ్రప్రదేశ్ లో 160 మంది ఎమ్మెల్యేలు ఎంతో క్లోజ్ గా ఉంటారని తెలియజేశారు.. సినిమా గురించి చెప్పుకోకుండా ఇలా రాజకీయ నాయకుల గురించి ఆయన ఇంటర్వ్యూలో బయట పెట్టడంతో అది కాస్త చర్చకు దారితీసింది. కొంపదీసి మంచు విష్ణు రాజకీయ పార్టీ ఏం పెట్టడం లేదు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Manchu Vishnu)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *