Manchu Vishnu: వినాయకుడి పాట ఆ క్రిస్టియన్ దే.. మరో వివాదంలో మంచు విష్ణు.?
Manchu Vishnu: మంచు ఫ్యామిలీ తాజాగా ఎన్ని వివాదాల్లో చిక్కుకుంటుందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మనోజ్ ఒకవైపు ఉంటే మోహన్ బాబు విష్ణులు మరోవైపు ఉన్నారు. ఇక లక్ష్మీ తనకేమీ పట్టదు అన్నట్లుగా ఈ ఇద్దరు గొడవల్లో తల దూర్చడం లేదు.ఓవైపు మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీలో అవతవకలు జరుగుతున్నాయని, దీనికంతటికి కారణం తన అన్నే అంటూ బల్లగుద్ది చెబుతున్నారు. తన తండ్రిని అడ్డుపెట్టుకొని తన అన్న నడిపిస్తున్న నాటకాలు అంటూ చెప్పుకొస్తున్నారు.
Manchu Vishnu in another controversy
అయితే ఇలాంటి వేళ మంచు విష్ణు ఓ వివాదంలో చిక్కుకున్నారు. వినాయకుడి పాట అయినా ఏకదంతాయ వక్రతుండాయ అనే పాట క్రిస్టియన్ దే అంటూ మాట్లాడి వివాదంలో చిక్కుకున్నారు. మరి ఇంతకీ విష్ణు చేసిన తప్పేంటో ఇప్పుడు చూద్దాం.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప..ఈ సినిమా కోసం దాదాపు రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతుండడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్,ప్రభాస్, నయనతార, కాజల్, మోహన్‌లాల్, మోహన్ బాబు వంటి ఎంతోమంది భారీ తారాగణాన్ని ఈ సినిమాలో తీసుకున్నారు. (Manchu Vishnu)
Also Read: Manoj: నా భార్య అడ్డు చెప్పకపోతే నీ తల ఎప్పుడో నరికే వాడిని.. విష్ణు పై మనోజ్ సంచలన పోస్ట్.?
అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా క్రిస్టియన్ అయినటువంటి స్టీఫెన్ చేస్తున్నారు.అయితే పురాణాలను బేస్ చేసుకుని వచ్చే హిందువుల సినిమాకి క్రిస్టియన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేయడం ఏంటి అని ఓ ఇంటర్వ్యూ లో మంచు విష్ణు కి ప్రశ్న ఎదురైంది.దానికి మంచు విష్ణు మాట్లాడుతూ.. మీరందరూ ఎందుకు అలా అంటున్నారో నాకు అర్థం అవ్వడం లేదు. కానీ నా దృష్టిలో స్టీఫెన్ అంటే ఒక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటి జనరేషన్ వాళ్ళు కూడా దేవుడి పాటలు వింటున్నారంటే అదంతా స్టీఫెన్ మహత్యమే.ఎందుకంటే ఆయన క్రియేట్ చేసిన ఏకదంతాయ వక్రతుండాయ అనే గణపతి ఆల్బమ్ ఇప్పటికి కూడా ఫేమస్ సాంగ్.
ఈ పాటని శంకర్ మహదేవన్ గారు పాడారు. అయితే ఈ పాటని ఆర్గనైజ్ చేసి ఎరేంజ్ చేసింది ఎవరో కాదు స్టీఫెనే.. ఆయనలో చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. అలాగే కన్నప్ప మూవీ లో కూడా శ్రీకాళహస్తి గురించి కూడా గొప్పగా మ్యూజిక్ కంపోజ్ చేశారు. అలాగే పని విషయంలో ఎవరు ఎలా చేస్తారు అని చూడాలి కానీ మతం గురించి ఆలోచించకూడదు అంటూ మంచు విష్ణు చెప్పారు.అయితే ప్రస్తుతం మంచు విష్ణు మాటలు వివాదంలో చిక్కుకున్నాయి. చాలామంది హిందువులు ఈయనపై ఫైర్ అవుతున్నారు. హిందువుల సినిమాకి క్రిస్టియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి అని మండిపడుతున్నారు.(Manchu Vishnu)