Manchu Vishnu: మంచు విష్ణుతో భార్య గొడవలు.. నాకు విడాకులిచ్చి వేరే అమ్మాయిని చేసుకో అంటూ..?

Manchu Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు.. అలాంటి ఈ ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి రాణిస్తున్నారు.. కానీ ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ నటులంతా స్టార్డం మాత్రం తెచ్చుకోలేకపోయారు. ఒక్క హిట్టు గట్టిగా పడితే చాలు కెరియర్ లో దూసుకుపోవచ్చనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే మంచు లక్ష్మి తెలుగు సినిమా ఇండస్ట్రీ ని వదిలి హిందీ ఇండస్ట్రీ వైపు వెళ్ళింది. అక్కడ పలు చిత్రాల్లో రాణిస్తోంది.
Manchu Vishnu wife quarrels with him
ఇక ఇదే తరుణంలో మంచు విష్ణు కన్నప్ప చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పైన మంచు ఫ్యామిలీ మొత్తం ఆశలు పెట్టుకొని ఉంది. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా మంచు ఫ్యామిలీ చాలా బిజీగా ఉంది. ఇదే తరుణంలో మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ తన పిల్లల గురించి ఒక విషయాన్ని బయటపెట్టారు. వివరాలు ఏంటో చూద్దాం.(Manchu Vishnu)
Also Read:Allu Arjun: అట్లీ సినిమాకి అల్లు అర్జున్ సరికొత్త సంచలనం..?
ప్రస్తుత కాలంలో చాలామంది ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే కంటున్నారు.. కానీ మంచు విష్ణు మాత్రం ఇప్పటికే నలుగురు పిల్లల్ని కన్నారు. అంతేకాదు ఇంకా పిల్లలు కావాలని అంటున్నారట. అయితే ఇదే విషయాన్ని తన భార్యను అడిగాడట. దీంతో ఆమె భయపడి ఇక పిల్లలు నాతో కాదు బాబోయ్, నీకు ఇంకా పిల్లల్ని కనాలని ఉంటే వేరే అమ్మాయిని చేసుకో అంటూ సమాధానం ఇచ్చిందట.

ప్రస్తుతం మంచు విష్ణు చెప్పిన ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. బడా ఫ్యామిలీలకు కుటుంబ నియంత్రణ అనేది ఉండదా అంటూ పలువురు నేటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంకా మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న కన్నప్ప చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబులు, కూడా నటిస్తున్నారట.(Manchu Vishnu)