Mango Leaves: మామిడికాయ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడికాయల సీజన్ ప్రారంభమవుతుంది. మామిడికాయలు, పండ్లు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. మామిడి కాయలతో పచ్చడి చేసుకోవడం, మామిడి పండ్లతో జ్యూస్ చేసుకోవడం, ఆ పండ్లను తినడం చేస్తూ ఉంటారు. అయితే మామిడి ఆకులతో చాలామందికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలియదు. Mango Leaves
mango leaves benefits
మామిడి ఆకులను చాలామంది ఇంటికి తోరణాలు కట్టడానికి మాత్రమే వాడుతారు. ప్రత్యేకించి పూజల సమయంలో ఇంటికి తోరణం కట్టడం, దేవుని వద్ద అలంకరించడం వంటివి మాత్రమే చేస్తారు. అయితే మామిడి ఆకులు తిన్నట్లయితే మన శరీరానికి చాలా మంచిది. మామిడి ఆకులు శరీరంలోని బ్యాక్టీరియాను తొలగిస్తాయి. బరువు తగ్గడానికి ముఖ్యపాత్ర పోషిస్తాయి. శరీరంలో మలబద్ధకం, వాపులు, ఉబ్బరం వంటి అనేక రకాల జీర్ణ సమస్యలను మామిడి ఆకులు తొలగిస్తాయి. Mango Leaves
Also Read: Yograj Singh: కపిల్ దేవ్ పై యూవీ ఫ్యామిలీ షాకింగ్ కామెంట్స్…ప్రజలు మీపై ఉమ్మేస్తారు..?
లేత మామిడి ఆకులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు అద్భుతంగా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు లేత మామిడి ఆకులు తిన్నట్లయితే మధుమేహం అదుపులో ఉంటుంది. లేదా మామిడి ఆకులను వేడి నీటిలో మరిగించి కషాయం లాగా తయారు చేసుకుని తాగినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా క్యాన్సర్, గుండె జబ్బులు, జీర్ణ క్రియ, కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి అనేక రకాల సమస్యలకు మామిడి ఆకులు ఎంతగానో సహాయం చేస్తాయి. Mango Leaves
ఇవి శరీరంలోని రక్తనాళాలను బలపరిచి…. రక్తపోటును నియంత్రించడానికి ముఖ్య పాత్ర పోషిస్తాయి. మామిడి ఆకులతో టీ తయారు చేసుకుని తాగినట్లయితే చాలా మంచిది. మామిడి ఆకులను మరిగించి ఆ నీటితో స్నానం చేసినా కూడా శరీరంలో ఏర్పడే ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మామిడి ఆకులతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నివేదికలో వెళ్లడయింది. Mango Leaves