Manoj: మనోజ్ సంచలన ఫిర్యాదు.. విష్ణు నన్ను చంపాలని చూసాడంటూ..?
Manoj: తెలుగు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న విషయాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మోహన్ బాబు ఫ్యామిలీ మ్యాటర్.. మొన్నటికి మొన్న మోహన్ బాబు కుటుంబంలో ఏర్పడిన చిచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. ఇదే మ్యాటర్ వల్ల మోహన్ బాబు కోపానికి వచ్చి జర్నలిస్టును కొట్టడం దీంతో జర్నలిస్టు సంఘాలు కోపానికి రావడం చివరికి మోహన్ బాబు సారీ చెప్పి క్షమాపణలు కోరడం అన్ని జరిగాయి.
Manoj sensational complaint that Vishnu wanted to kill me
అలా వీరి వ్యవహారం కొన్నాళ్లపాటు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత మంచు విష్ణు వచ్చి అందరినీ కాంప్రమైజ్ చేసి కేసు వెనక్కి తీసుకోవడంతో కాస్త చల్లారిపోయింది. కానీ ఆ వివాదం అనేది మరోసారి తాజాగా తెరపైకి వచ్చింది. తాజాగా మంచు మనోజ్ తన అన్న విష్ణుపై తనకు ప్రాణహాని ఉందని కేసు పెట్టడం సంచలనంగా మారింది. ( Manoj)
Also Read: PV Sindhu marries Venkat: ఉదయపూర్‌లో ఘనంగా పీవీ సింధు వివాహం.. పెళ్లి డ్రెస్సులో అదిరిపోయిన లుక్!!
పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా మనోజ్ పహాడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు విష్ణుపై కేసు పెట్టాడు. ఆయన పైనే కాకుండా వినయ్ అనే వ్యక్తిపై కూడా ఫిర్యాదు చేశాడు. తనకు మంచు విష్ణు వల్ల ప్రాణహాని ఉందని ఏడు పేజీలు లేఖను పోలీసులకు అందించాడు.. అయితే తన తండ్రి మోహన్ బాబు తన కూతురును ఇంట్లో పెట్టుకుని నన్ను బయటకి గెంటేసాడని, అంతే కాకుండా వినయ్ అనే వ్యక్తితో నాపై దాడి చేయించాడని తెలియజేశారు..
ఇదే తరుణంలో విష్ణుతో తనకు ప్రాణహాని ఉందని, మొన్నటికి మొన్న మనోజ్ తల్లి నిర్మల దేవి పుట్టినరోజు సందర్భంగా విష్ చేయడానికి ఇంటికి వెళ్లి జనరేటర్ లో పంచదార వేసి పవర్ పోయేలా చేశాడని, దీంతో చీకటి ఏర్పడిందని, ఇదే సమయంలో నన్ను చంపాలని ట్రై చేశారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విధంగా మనోజ్ విష్ణుపై కేసు పెట్టడంతో మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలుస్తోంది.( Manoj)