Manoj: నా భార్య అడ్డు చెప్పకపోతే నీ తల ఎప్పుడో నరికే వాడిని.. విష్ణు పై మనోజ్ సంచలన పోస్ట్.?
Manoj: గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీ మధ్య విపరీతమైన గొడవలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ గొడవలకు కారణం ఆస్తి పంపకాలు అన్నట్టు తెలుస్తోంది. ఈ గొడవ వల్ల రోడ్డేక్కిన మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ చివరికి రిపోర్టర్ ని కొట్టాడు. ఇది కాస్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవ్వడంతో చివరికి ఆ రిపోర్టర్ కి స్వారీ చెప్పాడు. అలా మోహన్ బాబు ఫ్యామిలీ లో రేగిన చిచ్చు ఆ మధ్య కాలంలో కాస్త డల్ అయిపోయింది.
Manoj Sensational post on Vishnu
కానీ తాజాగా ఒకటి రెండు రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా మరోసారి వార్ నడుస్తోంది. అయితే తాజాగా మంచు విష్ణు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు. దీనికి కౌంటర్ గా మనోజ్ బదిలిచ్చాడు. ఆర్జీవి డైరెక్షన్ లో వచ్చినటువంటి మోహన్ బాబు రౌడీ చిత్రంలోని ఒక డైలాగ్ ఆడియోను విష్ణు పోస్ట్ చేశాడు. ” సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయిన తెలుసుకుంటావని ఒక చిన్న ఆశ ” అనే వాయిస్ ను పోస్ట్ చేశాడు. (Manoj)
Also Read: Anil Ravipudi: రెమ్యూనరేషన్ లో వెంకీనే మించిన అనిల్ రావిపూడి.. అంత తీసుకున్నారా..?
దీని కింద ఇది నా ఫేవరెట్ డైలాగ్ ఇందులో ప్రతి డైలాగ్ ఒక స్టేట్మెంట్ అని క్యాప్షన్ ఇచ్చాడు. దీనికి బదులుగా మంచు మనోజ్ కౌంటర్ ఎటాక్ చేశాడు.. కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణం రాజు లాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఈ జన్మలోనే తెలుసుకుంటావు అని చెప్పాడు. అయితే ఈ పోస్టులో కృష్ణంరాజుకు సంబంధించిన పోస్టర్ ను కూడా చెక్ చేశాడు.
ఈ విధంగా ఇద్దరు పెట్టినటువంటి పోస్టుల్లో సింహం కుక్క అనే కామన్ పదాలు ఉండడంతో ఇద్దరి మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోందని నేటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇంతటితో ఆగకుండా మనోజ్ మరో పోస్ట్ కూడా చేశాడు. తన తండ్రి చిత్రంలోని ఆస్తి తగాదాలకు సంబంధించినటువంటి ఒక సీన్ పోస్ట్ చేశాడు. ఇక ఈ తథంగమంతా చూస్తే మాత్రం మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.(Manoj)