Manoj: విష్ణుని చంపాలనుకున్న మనోజ్.. మోహన్ బాబు ఆడియో వైరల్.?
Manoj: ఏంటి మంచు మనోజ్ విష్ణుని చంపాలి అనుకున్నారా.. మోహన్ బాబు మాట్లాడిన మాటల్లో ఎంత నిజం ఉంది.. మనోజ్ కి విష్ణుని చంపే అంత కోపం ఉందా.. అసలు విష్ణుని చంపాలని మనోజ్ ఎందుకు అనుకున్నారు అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవల కారణంగా వీరి గురించి ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలా మనోజ్ మోహన్ బాబు వ్యాపారాల్లో అక్రమాలు జరుగుతున్నాయని అంటే మోహన్ బాబు ఏమో తన ఆస్తిలో ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాను.

Manoj who wanted to kill Vishnu Mohan Babu audio viral
అవన్నీ నాకు తెలుసు..నేను అనాధాశ్రమానికి రాసిస్తాను. ఎవరికైనా ఇస్తాను అది నా ఇష్టం నేను నా కష్టంతో కట్టుకున్న ఇంట్లోకి ఎవరిని రానివ్వను అంటూ మాట్లాడుతున్నారు. అలాగే మీడియా మీద మోహన్ బాబు దాడి చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ దాడిలో జర్నలిస్టు తీవ్రంగా గాయపడ్డారు. అయితే తాజాగా మోహన్ బాబు కి సంబంధించిన ఒక ఆడియో నెట్టింట సంచలనం సృష్టిస్తుంది.(Manoj)
Also Read: Mohan Babu: అన్ని గొడవలకు కోడలే కారణం..7 నెలల మనవరాలిని పనిమనిషికి ఇచ్చి..?
ఇక ఆ ఆడియో లో మోహన్ బాబు పెద్దకొడుకు విష్ణుని మనోజ్ చంపాలి అనుకున్నాడంటూ మోహన్ బాబు మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో మనోజ్ కి విష్ణుని చంపేంత పగ ఉందా అంటూ ఈ విషయం తెలిసిన జనాలు కామెంట్లు పెడుతున్నారు. ఇక మోహన్ బాబు మాట్లాడిన ఆడియో లో ఏముందంటే..అందర్నీ కొట్టడానికి వస్తావ్.. వినయ్ గారు సహాయం చేయడానికి వస్తే ఆయన మీదికి కూడా వెళ్తావ్. వాడెవడు లం**కొడుకు వాన్ని చంపేస్తా అంటూ బూతులు తిడతావు. మీ అన్నని తిడతావు.

అంటే నాకు ఎవరు సహాయం చేస్తే వారందరినీ చంపేస్తావా.. అసలు నువ్వు ఇంకా ఏం చేయాలనుకుంటున్నావ్.. ఏం సాధిద్దామనుకుంటున్నావు.. మీ అన్నని కొట్టడానికి వచ్చావు.. చంపుతాను అన్నావు.. దమ్ముంటే వాడిని నువ్వు తాకరా అని నేనే అన్నాను.. వాన్ని చంపేస్తా అంటావా. చంపేయ్ ఎంతమందిని చంపుతావో చూస్తా.ఏం సాధిస్తావో చూస్తా. అంటూ మోహన్ బాబు మాట్లాడిన ఆడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది.దీంతో ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తోంది.(Manoj)