Maruti Cars Price: మారుతి సుజుకి కార్ల ధరల పెంపు – ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి!!
Maruti Cars Price: మారుతి సుజుకి ఫిబ్రవరి 1, 2025 నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ముడి సరుకుల ధరలు పెరగడం, ఉత్పాదన, నిర్వహణ ఖర్చులు అధికమవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. వివిధ మోడళ్లపై రూ. 1,500 నుంచి రూ. 32,500 వరకు పెరుగుదల ఉండనుంది. Celerio మోడల్‌పై గరిష్టంగా రూ. 32,500 వరకు పెరుగుతుందని తెలుస్తోంది.
Maruti Cars Price Increased from February
Swift, Dzire, Brezza, Wagon R వంటి ప్రజాదరణ పొందిన మోడళ్ల ధరలు కూడా పెరుగుతాయి. కొత్త కారు కొనాలని భావిస్తున్న వినియోగదారులకు ఇది ముఖ్యమైన అప్డేట్. ఫిబ్రవరి 1 లోపు కొనుగోలు చేస్తే ప్రస్తుత ధరకే పొందే అవకాశం ఉంది. ఆసక్తి గల కస్టమర్లు సమీపంలోని Maruti Suzuki Showroom లో బుకింగ్ చేసుకోవచ్చు.
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మారుతి సుజుకి ఎగుమతులు 21% పెరిగాయి. ఏప్రిల్-డిసెంబర్ 2024 మధ్య 245,642 కార్లు ఎగుమతి చేసినట్లు కంపెనీ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ Maruti Suzuki Carsకు మంచి డిమాండ్ ఉందని సమాచారం.
మారుతి సుజుకి మోడల్స్ తాజా ధరల పెంపు వివరాలు
Alto K10 – రూ. 19,500 | Wagon R – రూ. 13,000 | Swift – రూ. 5,000 | Dzire – రూ. 10,500 | Brezza – రూ. 20,000 | Ertiga – రూ. 15,000 | Baleno – రూ. 9,000 | Grand Vitara – రూ. 25,000 | Ciaz – రూ. 1,500 | Invicto – రూ. 30,000 | ఇతర మోడళ్లకు కూడా సవరించిన ధరలు అమలులోకి రానున్నాయి.