Meena: ఇన్నాళ్లకు మీనా మంచి నిర్ణయం.. ఆ హీరోతో రెండో పెళ్లిపై సంచలనం.?

Meena: సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ చనిపోయాక ఆమెపై ఎన్నో రకాల రిలేషన్ రూమర్స్ వినిపించాయి. ముఖ్యంగా మీనా తన భర్త చనిపోయాక కూతురు నైనిక కోసం రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందని పలువురు హీరోల పేర్లు కూడా తెర మీద వినిపించాయి. అయితే కోలీవుడ్ లో చాలా రోజుల నుండి మీనా రెండో పెళ్లి వార్తలు వినిపిస్తున్న వేళ ఎప్పటికప్పుడు మీనా కూడా వాటిపై క్లారిటీ ఇస్తూ వస్తుంది.
Meena Sensational comments on second marraige
ఇక మీనా ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా ఆమె రెండో పెళ్లి విషయంపైనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆ ప్రశ్నలన్నింటికీ మీనా సరైన సమాధానం చెబుతుంది.నేను ఎలాంటి రెండో పెళ్లి చేసుకోవడం లేదు. నేను ఎవర్ని ప్రేమించడం లేదు.అవన్నీ రూమర్లు మాత్రమే.ఇప్పటి నుండి నా వ్యక్తిగత జీవితాన్ని వదిలేయండి. నా వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడాలని అనుకోకండి అంటూ కౌంటర్ ఇచ్చినా కూడా ఈ వార్తలు ఆపడం లేదు. (Meena)
Also Read: Heroine: తమిళ నిర్మాతతో హీరోయిన్ అక్రమ సంబంధం.. నిజమేనా..?
ఇక చాలా రోజులు నుండి మీనా విడాకులు తీసుకున్న ధనుష్ ని రెండో పెళ్లి చేసుకోబోతుంది అనే రూమర్లు వినిపిస్తున్నాయి.అయితే ఇది నిజం కాకపోయినప్పటికీ విడాకులు తీసుకొని ధనుష్ సింగిల్ గా ఉండి అలాగే భర్త చనిపోయి మీనా కూడా ఒంటరిగా ఉంది. కాబట్టి వీరిద్దరికి పర్ఫెక్ట్ జోడి అంటూ చాలామంది కోలీవుడ్లో వీరిపై అసభ్యంగా మాట్లాడుకుంటున్నారు.

కానీ ఈ వార్తలపై మీనా మరొక్కసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. మీనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు రెండో పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశం లేదు.కానీ నా కూతురు కోసం భవిష్యత్తులో ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటాను. అలాగే ఎవరితో సన్నిహితంగా ఉంటే వారితో ఎఫైర్లు అంటగట్టేస్తారా.. నాకు ధనుష్ తో రెండో పెళ్లి అంటూ వార్తలు రాస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నా పూర్తి ఫోకస్ నా కూతురు మీదే ఉంది అంటూ మీనా మరోసారి క్లారిటీ ఇచ్చింది.(Meena)