Meenakshi Chaudhary: సాయంకాలం వేళ..ఇసుక తీరాల్లో పొడుగు సుందరి..సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మీనాక్షి చౌదరి!!
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి, టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన యువ నటీమణి. ఇటీవల కాలంలో ఆమె నటించిన ప్రతి చిత్రం సూపర్ హిట్ అయ్యింది, దాంతో ఆమెకు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల నుంచి వరుస ఆఫర్లు అందుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో విక్టరీ వెంకటేష్ తో చేసిన నటన తన కెరీరుకు ఒక మైలురాయి అయ్యింది. ఈ సినిమా రూ. 300 కోట్ల క్లబ్ లో చేరే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది.
Meenakshi Chaudhary Dubai vacation photos viral
ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ, మీనాక్షి తన కుటుంబంతో కలిసి దుబాయ్ లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వీధుల్లో తిరుగుతూ, ఎడారిలో విహరిస్తూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. ఆమె ఈ ట్రిప్ ను 2025 లో మొదటి ప్రయాణంగా పేర్కొన్నారు. ఈ ప్రయాణం గురించి ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేయగా, అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మీనాక్షి లక్కీ భాస్కర్ సినిమాతో మంచి హిట్ కొట్టిన తరువాత, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయాలతో ఆమె ఈ సమయంలో ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలతో బిజీగా ఉన్నారు, మరియు ఆఫర్లు కూడా పెరుగుతున్నాయి.