Meenakshi Chaudhary: తెలుగు ఇండస్ట్రీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. వరుసగా ఆఫర్లు లేకపోయినా కానీ, అడపా దడపా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పాటు చేసుకుంది. అలాంటి మీనాక్షి చౌదరి తాజాగా అక్కినేని కుటుంబానికి చెందిన ఒక హీరోతో ప్రేమలో పడిందని త్వరలో పెళ్లికూడా చేసుకోబోతుందని ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే అక్కినేని సుశాంత్.
Meenakshi Chaudhary who spoke openly about marriage with Sushant
అయితే వీరిద్దరూ కలిసి నటించింది ఒకే ఒక సినిమా. అయితే మీనాక్షి చౌదరికి ఇది మొదటి తెలుగు సినిమా. ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే ఇచ్చట వాహనములు నిలపరాదు. ఈ మూవీ ద్వారానే తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఈ మధ్యనే లక్కీ భాస్కర్ అనే సినిమా ద్వారా సూపర్ హిట్ అందుకుంది. (Meenakshi Chaudhary)
Also Read: Allu Arjun: పరమ పిసినారి అంటూ తండ్రిని తిట్టిన అల్లు అర్జున్..?
అలాగే మట్కా అనే మూవీ ద్వారా ఫ్లాప్ మూటగట్టుకుంది. ఆ సినిమాల సంగతి పక్కన పెడితే మీనాక్షి చౌదరి అక్కినేని సుశాంత్ తో పెళ్లికి రెడీ అయిందని ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ విషయంపై మీనాక్షి చౌదరి స్పందించినట్టు తెలుస్తోంది.
అయితే నేను ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా హీరోతో నాకు రిలేషన్ ఉందని సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. అలాంటిది ఏమీ లేదు, నాకు పెళ్లి చేసుకునే ఆలోచన అస్సలు లేదు. ఇలాంటి రూమర్స్ ను నేను పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వడంతో ఈ పుకార్లకు చెక్ పడుతుందా లేదంటే అలాగే వెళ్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.(Meenakshi Chaudhary)