Meera Jasmine: మీరాజాస్మిన్ ఆ హీరో ని పెళ్లి చేసుకోవాల్సింది.. కానీ ఎటూ కాకుండా పోయిందిగా..?

Meera Jasmine: మీరా జాస్మిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ అంటే తెలియని వారు. ఒకప్పుడు ట్రెడిషనల్ పాత్రలు అంటే ఈమె మాత్రమే గుర్తుకు వచ్చేది. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది ఈ ముద్దుగుమ్మ. కెరియర్ మంచి పొజిషన్ లో కొనసాగుతున్న సమయంలోనే వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. అలాంటి మీరాజాస్మిన్ ఒకరిని లవ్ చేసి ఆయననే పెళ్లి చేసుకుంటుంది అనుకునే సమయానికి తీరా మరొకరిని పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె ఎవరితో ప్రేమాయణం నడిపింది.. ఎవరిని పెళ్లి చేసుకుంది అనే వివరాలు చూద్దాం.?
Meera Jasmine was supposed to marry that hero
ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం హాట్ లుక్ లో పొట్టి పొట్టి బట్టలు వేసుకొని వారి అందాలన్నీ చూపించి అవకాశాలు అందుకుంటున్నారు. కానీ ఒకప్పుడు మీరాజాస్మిన్ చీరకట్టులో మాత్రమే నటించి తానేంటో నిరూపించుకుంది. ఎన్నో చిత్రాల్లో చేసి మంచి హిట్లు అందుకుంది. అలాంటి ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో రాజేష్ మాండలిన్ అనే వ్యక్తితో లవ్ లో పడింది. వీరిద్దరూ వివాహం ద్వారా ఒక్కటవుతారు అనే టైంలో అనిల్ టైటాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. (Meera Jasmine)
Also Read: Nag Chaitanya Wedding: నాగచైతన్య పై సావితి ప్రేమ చూపిస్తున్న అమల.. ఇదే సాక్ష్యం!!
ఇక వివాహం తర్వాత సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి అనేక ప్రయత్నాలు చేస్తుండట.. దానికోసం ఆమె ఎలాంటి పాత్రలో అయినా చేయడానికి రెడీ అవుతుందట.. ఈమె సినిమాల విషయాన్ని పక్కనబెడితే, గతంలో ఈమె సలార్ చిత్రంలో కీలక నటుడు అయినటువంటి పృథ్వీరాజ్ ను వివాహం చేసుకోవాలని భావించిందట. ఇద్దరి మధ్య అప్పట్లో డేటింగ్ నడుస్తుందని అనేక వార్తలు వినిపించాయి.

ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో స్వప్నికుడు, చక్రం అనే చిత్రాలు వచ్చాయి. ఈ సినిమా టైంలోనే వీరి మధ్య లవ్ పుట్టి పెళ్లి చేసుకునే వరకు వెళ్లిందట. కానీ పృథ్వీరాజ్ ఫ్యామిలీ మీరాజాస్మిన్ ని కోడలుగా అంగీకరించకపోవడంతో ఈ బంధానికి స్వస్తి పలకాల్సి వచ్చిందట. ఇందులో ఎంతవరకు నిజం ఉందో, అబద్ధం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Meera Jasmine)