Chandrababu: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ… తాజాగా సమావేశం అయ్యారు. ఈ ఇద్దరు బడా నేతల సమావేశం ప్రగతి భవన్ లో శనివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న.. పెండింగ్ సమస్యలు, నీళ్ల పంపకాలు, ఆస్తుల పంపకాలు… ఇంకా… తిరుమల దేవస్థానం, ఓడరేవుల అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. Chandrababu

Meeting with Chandrababu Telangana traitor Revanth Reddy

అంతేకాకుండా భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపిన ఏడు మండలాలలో… కనీసం ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని… రేవంత్ రెడ్డి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయి గూడెం, పిచ్చుకలపాడు గ్రామపంచాయతీలను… కూడా సీఎం చంద్రబాబు నాయుడును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగినట్లు సమాచారం అందుతోంది. ఇక దీనిపై కేంద్ర హోం శాఖకు కూడా లేఖ రాయాలని… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. Chandrababu

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను అవమానపరుస్తున్న చంద్రబాబు.. ప్రతి చోట అదే పని ?

అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని భవనాలను ఇవ్వాలని చంద్రబాబు కోరారట. హైదరాబాదులో ఉన్న కొన్ని భవనాలను తమకు… ఉచితంగా ఇవ్వాలని రేవంత్ రెడ్డిని చంద్రబాబు అడిగారట. అయితే దీనికి రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదని సమాచారం. అయితే గులాబీ పార్టీ మాత్రం ఏడు మండలాలను తెలంగాణలో కలపాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేవలం ఐదు మండలాలను మాత్రమే తెలంగాణలో కలపాలని అడిగారట. Chandrababu

దీంతో గులాబీ పార్టీ రేవంత్ రెడ్డి పై సీరియస్ అవుతోంది. తెలంగాణకు ఏడు మండలాలు తీసుకురాకపోతే రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా మిగులుతాడని.. గులాబీ పార్టీ నేతలు అంటున్నారు. అంతేకాకుండా… కృష్ణానది జలాల పంపకాలను కూడా…. సజావుగా జరిగేలా చూడాలని… తెలంగాణకు అన్యాయం జరిగితే మరో ఉద్యమం చేస్తామని గులాబీ పార్టీ హెచ్చరిస్తోంది. మరి రేవంత్ రెడ్డి వీటిపై ఎలా స్పందిస్తారో చూడాలి. Chandrababu