Niharika: మెగా డాటర్ నిహారిక ఫస్ట్ జీతం ఇంత తక్కువా.. ?


Niharika: మెగా డాటర్ నిహారిక ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కానీ హీరోయిన్లుగా మాత్రం కేవలం నిహారిక మాత్రమే ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు తన చలాకీతనం, అందంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ చిన్న దానికి విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలోనూ నిహారికకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. నిహారిక యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన అనంతరం హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేసింది.

Mega daughter Niharika’s first salary

ఇప్పుడు నిహారిక కొన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తూ నిర్మాతగాను మారిన సంగతి తెలిసిందే. కమిటీ కుర్రోళ్ళు సినిమాతో నిహారిక నిర్మాతగా మంచి గుర్తింపు అందుకుంది. అయితే కమిటీ కుర్రోళ్ళు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం నిహారిక చాలా కష్టపడింది. సినిమాల్లోకి రాకముందు నిహారిక మొదట ఓ కేఫ్ లో పని చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కెఫెలో పనిచేసిన సమయంలో నిహారిక కేవలం వారానికి వెయ్యి రూపాయలు మాత్రమే జీతంగా తీసుకున్నానని చెప్పారు. అంటే నెలకు కేవలం 4000 రూపాయల మాత్రమే తన సంపాదన అని నిహారిక వెల్లడించారు.

IPL 2025: ధోని కోసం CSK కుట్రలు.. ఆ ఇద్దరు ఔట్ ?

తన చదువు మొత్తం హైదరాబాద్ లోనే పూర్తి చేశానని చెప్పింది. చదువు పూర్తయిన తర్వాత విదేశాల్లోకి వెళ్లి ఏదైనా చేయాలని మనసులో ఉన్నప్పటికీ వెళ్లలేకపోయానని నిహారిక అన్నారు. తన ఇంట్లో వాళ్ళు తనని ఎక్కడికి పంపించేవారు కాదని నిహారిక అన్నారు. ఇటీవల ఈమె నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా ఓ సినిమా ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తారని వెల్లడించింది. అంతేకాకుండా నిహారిక నటిగా కూడా చాలా బిజీగా ఉన్నానని అన్నారు. త్వరలోనే తన కెరీర్ కి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ అనౌన్స్ చేస్తానని నిహారిక ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం నిహారిక మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌ను దారుణంగా కొట్టిన పోలీసులు ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *