Pushpa-2: పుష్ప-2 ఫ్లాప్ చేయాలని మెగా ఫ్యామిలీ కుట్రలు.. సీక్రెట్ ఆడియో కాల్ లీక్.?
Pushpa-2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో అల్లు ఫ్యామిలీ ఒకటి. ఫ్యామిలీ నుంచి కేవలం అల్లు అర్జున్ మాత్రమే హీరోగా నిలదొక్కుకోగలిగారు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్నారు. అలాంటి అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ చాలా దగ్గరి బంధువులు. నిజానికి ఈ రెండు ఫ్యామిలీలు ఒకటే అనుకోవచ్చు. అలాంటి ఈ దగ్గరి ఫ్యామిలీల మధ్య ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ‘
Mega family conspiracies to flop Pushpa-2
ఇందులో ముఖ్యంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో ఎప్పుడు విభేదిస్తూనే ఉంటారు. అంతే కాదు మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ పై ఇన్ డైరెక్టుగా విమర్శలు కూడా వస్తుంటాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్స్ టైంలో మెగా ఫ్యామిలీ మొత్తం టిడిపికి సపోర్ట్ చేస్తే, అల్లు అర్జున్ మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేసి ఆయన గెలుపు కోసం ముందుకు సాగారు. ఆ టైంలో నాగబాబు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే బన్నీ కనీసం వెళ్లి విషెస్ కూడా చెప్పకపోవడం వల్ల, వీరి విభేదాలు మరోసారి బయటకు వచ్చాయి. (Pushpa-2)
Also Read: Shriya: టాలీవుడ్ లో మరో బ్యాడ్ న్యూస్.. భర్తకు శ్రియా విడాకులు..?
ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ ఒక సమావేశంలో మాట్లాడుతూ హీరోలు కూడా స్మగ్లర్ల పాత్రలు చేస్తూ జనాల్ని చెడగొడుతున్నారంటూ మాట్లాడారు. ఆయన ఇన్ డైరెక్ట్ గా బన్నిని విమర్శించారని, ఓవైపు మెగా అభిమానులకు మరోవైపు అల్లు అభిమానులకు తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఇక ఇదంతా పక్కన పెడితే డిసెంబర్ 5వ తేదీన పుష్ప2 గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతోంది. ఇదే తరుణంలో కొంతమంది అల్లు అర్జున్ అంటే పడని వ్యక్తులు సినిమాపై నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక ఆడియో కాల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇందులో విపిఎస్ ద్వారా సినిమాను లైవ్ స్ట్రీమింగ్ చేస్తానని, ఈ క్రమంలోనే సినిమా బాలేదని చెబుతానని ఓ అభిమాని చెప్పడం జరుగుతోంది. విపిఎన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఐపీ అడ్రస్ ఎవరిది అన్నది దొరకడం కష్టమే అని చెప్పుకోవడం ఆడియో కాల్ రికార్డుల్లో వినిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ అభిమానులు గట్టిగానే కౌంటర్ విసురుతున్నారు. దమ్ముంటే ఆచార్య ఎందుకు సక్సెస్ చేసుకోలేకపోయారు. పుష్ప2 చిత్రాన్ని అడ్డుకోవడం మీ తరం కాదంటూ మెగా అభిమానులకు కౌంటర్ విసురుతున్నారు..ఈ విధంగా ఎప్పుడు ఏదో ఒక విషయంలో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు వస్తూనే ఉంటాయి.(Pushpa-2)