Vishwambhara Movie: బాలయ్య సక్సెస్.. చిరు పై ఒతిడి పెంచుతుందా?
Vishwambhara Movie: టాలీవుడ్ లెజెండ్ మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరోయిన్ త్రిష కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చాలా కాలం తర్వాత చిరంజీవి ఫాంటసీ చిత్రంలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Mega fans Hopes on Vishwambhara Movie
టీజర్ విడుదల తర్వాత చిత్ర యూనిట్ కాస్త సైలెంట్ అయింది. అయితే, తాజాగా దర్శకుడు వశిష్ఠ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చిరంజీవికి సంబంధించిన ఒక వింటేజ్ వీడియో క్లిప్‌ను ఆయన షేర్ చేశారు. దీనికి ఫైర్ ఎమోజీని కూడా జత చేశారు.
ఈ సస్పెన్స్ ఫుల్ పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్ట్‌కు “విశ్వంభర”కు ఏదైనా సంబంధం ఉందా అనేది తెలియాల్సి ఉంది. దర్శకుడు వశిష్ఠ దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. “విశ్వంభర” చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకోవైపు నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో వరుస ఫ్లాప్ లలో ఉన్న చిరు ఈ సినిమా తో హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.