Megastar: మెగాస్టార్ కి క్యాన్సర్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్.?

Megastar: అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు హీరో హీరోయిన్ల కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి.అయితే తాజాగా మెగాస్టార్ కి క్యాన్సర్ అంటూ ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఈ వార్త ఇండస్ట్రీని షేక్ చేసి పారేస్తోంది. మరి ఇంతకీ మెగాస్టార్ కి క్యాన్సర్ అంటూ వస్తున్న వార్తల్లో ఉన్న నిజమంతా.. నిజంగానే ఆయన క్యాన్సర్ బారిన పడ్డారా అనేది ఇప్పుడు చూద్దాం.
Megastar cancer news is shaking up the industry
ఎవరైనా హీరో హీరోయిన్లు రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్ దగ్గర కనిపిస్తే చాలు వారికి ఏదో వ్యాధి ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా మెగాస్టార్ కి క్యాన్సర్ అంటూ సోషల్ మీడియా మొత్తం ప్రచారం జరుగుతుంది.ఇక మెగాస్టార్ అంటే అందరూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అనుకుంటారు.కానీ చిరంజీవి కాదు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఏడుపదుల వయసు దాటినా కూడా ఇంకా చాలా యంగ్ గానే కనిపిస్తారు.(Megastar)
Also Read: Vineetha: ఆయన వల్లే వెంకటేష్ హీరోయిన్ వ్యభి**రంలో ఇరుక్కుందా.?
అంతే కాదు ఇంత ఏజ్ వచ్చినా కూడా ఆయన ఇంకా ఫిట్ గా తన ఫిజిక్ ని మెయింటైన్ చేస్తారు. అంతే కాదు దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి ఇద్దరినీ పక్కపక్కన పెడితే తండ్రి కొడుకులు కాదు అన్నదమ్ములు అని అంటారు.అలా ఎంతో యంగ్ గా మంచి ఫిజిక్ ని మెయింటైన్ చేసే మమ్ముట్టికి క్యాన్సర్ వచ్చింది అంటూ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కలకలం రేపాయి.

అయితే ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం గత కొద్దిరోజుల నుండి మమ్ముట్టి ఎక్కువగా సినిమాల్లో కనిపించకపోవడంతో మమ్ముట్టికి క్యాన్సర్ వచ్చిందని,అందుకే ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చి క్యాన్సర్ కి మెరుగైన చికిత్స తీసుకుంటున్నారని, ఆయన త్వరగా క్యాన్సర్ నుండి కోలుకోవాలి అంటూ ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రూమర్లు ఎక్కువ వైరల్ అవ్వడంతో ఇది కాస్త మమ్ముట్టి పిఆర్ టీం దగ్గరికి వెళ్లడంతో సోషల్ మీడియా ద్వారా మమ్ముట్టికి ఎలాంటి క్యాన్సర్ లేదు ఆ వార్తలన్నీ అవాస్తవాలు అంటూ మమ్ముట్టి పిఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. ఇక మెగాస్టార్ పీఆర్ టీం క్లారిటీ ఇవ్వడంతో మమ్ముట్టి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.(Megastar)