Samantha: సమంత చైతు శోభిత కాంబోలో మిస్సయిన మూవీ.. ఆ టైంలోనే శోభితతో ఎఫైర్.?
Samantha: సమంతా నాగ చైతన్య వీరు సినిమాల్లో అంతగా పేరు తెచ్చుకోకపోయినా కానీ వీరి విడాకుల వ్యవహారమే అందరికీ తెలిసేలా చేసింది. సమంత నాగచైతన్య సినిమాల్లో కలిసి నటించి ఆ తర్వాత ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు.. వీరిద్దరి కాంబినేషన్లో చాలా చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏం మాయ చేసావే. ఈ సినిమా నాగచైతన్య లైఫ్ ను టర్న్ చేసింది. సమంత హీరోయిన్ గా నటించడంతో షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది.
Missed movie in Samantha Chaitu Sobhita combo
అలా సీక్రెట్ గా రిలేషన్ మెయింటైన్ చేస్తున్న వీరు 2017లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని ఏళ్ల పాటు హ్యాపీగా జీవించిన ఈ జంట మధ్య ఏం పుట్టిందో ఏమో విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అలాంటి సమంతా నాగ చైతన్య కలిసి నటించిన చిత్రాల్లో మజిలీ, మనం సినిమాలు కూడా అద్భుతమైన హిట్లు సాధించాయి. ఇవే కాకుండా ఓ బేబీ, మహానటి వంటి చిత్రాల్లో కూడా గెస్ట్ రోల్ చేశారు నాగచైతన్య. (Samantha)
Also Read: Heroine: రెండోసారి తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్..?
ఇందులో మజిలీ చిత్రం చాలా స్పెషల్.. అయితే ఈ సినిమాను డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించారు. ఒక లవ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో నాగచైతన్య, సమంత పోటీ పడి నటించారు. అంతేకాకుండా ఇందులో మరో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ ఉంది. దివ్యాంశా చేసిన పాత్రకు మొదట శోభిత ధూళిపాలను హీరోయిన్ గా తీసుకున్నారట. కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరణ జరిగిన తర్వాత అనుకొని కారణాలవల్ల ఆమె ప్రాజెక్టుకు దూరమైందట.
అలా కొన్నాళ్లపాటు షూటింగ్ సమయంలోనే నాగచైతన్యకు శోభితాకు పరిచయం ఏర్పడిందట. అలా సమంతను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆయన శోభితతో కాస్త ఫ్రెండ్షిప్ మైంటైన్ చేశారట. తర్వాత నాగచైతన్య సమంత విడిపోయారు. దీంతో ప్లేట్ ఫిరాయించిన నాగ చైతన్య శోభితాను వివాహం చేసుకున్నారు. అలా సమంత, నాగచైతన్య, శోభితలా కాంబినేషన్ లో రావలసిన సినిమా మిస్సయిందని తెలుస్తోంది.(Samantha)