Mithali Raj: ఆ హీరోతో మిథాలీ సీక్రెట్ రిలేషన్ ?


Mithali Raj: టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఇటీవల తన 42వ పుట్టినరోజును జరుపుకుంది. మిథాలీ రాజ్ 1982 డిసెంబర్ 3న రాజస్థాన్ లోని జోద్పూర్ లో జన్మించారు. మిథాలీ రాజ్ తన కెరీర్ లో భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలను అందించారు. మిథాలీ రాజ్ దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. దేశంలోని అమ్మాయిలు మిథాలీ రాజ్ ను వారి రోల్ మోడల్ గా భావిస్తూ ఉంటారు. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన మహిళ బ్యాట్స్మెన్ గా మిథాలీ రాజ్ నిలిచారు. Mithali Raj

Mithali Raj ABOUT Her Marriage

తన కెరీర్ లో ఎన్నో రికార్డులను సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి ఉండవచ్చు. కానీ నేటికీ ఆమె వార్తల్లో నిలవడం విశేషం. దాదాపు 23 ఏళ్ల పాటు క్రికెట్ ఫీల్డ్ ను శాసించిన మిథాలీ రాజ్ ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. మిథాలీ రాజ్ చాలా షోలలో తన పెళ్లి గురించి ఓపెన్ గా మాట్లాడారు. తగిన వరుడు ఎవరైనా దొరికినట్లయితే కచ్చితంగా వివాహం చేసుకుంటారని చాలాసార్లు చెప్పారు. సోషల్ మీడియాలో మిథాలీ రాజ్ వీడియో వైరల్ అవుతుంది. Mithali Raj

Also Read: WTC: టీమిండియా WTC చేరాలంటే… ఇలా జరగాల్సిందే ?

మిథాలీ రాజ్ తాజాగా కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. అందులో కపిల్ శర్మతో మిథాలీ రాజ్ మాట్లాడుతూ….తాను ఓ నటుడిని వివాహం చేసుకోవాలనుకున్నానని చెప్పారు. అయితే అతడికి అప్పటికే వివాహం జరిగిందని మిథాలీ రాజ్ అన్నారు. కపిల్ శర్మ ఆ నటుడి పేరు అడగగా మిథాలీ రాజ్ తాను అతడిని వివాహం చేసుకోవాలని అనుకున్నట్లుగా బదులిచ్చింది. కానీ అతనికి పెళ్లి అవ్వడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపింది. కాగా, తనకు తగిన అబ్బాయి దొరికితే ఖచ్చితంగా వివాహం చేసుకుంటానని మిథాలీ రాజ్ వెల్లడించారు. Mithali Raj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *