Mohammed Siraj: హీరోయిన్ తో సిరాజ్ డేటింగ్.. క్లారిటీ ఇదే ?
Mohammed Siraj: టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్ నుంచి టీమిండియాలోకి వెళ్లిన… మొదటి ఫాస్ట్ బౌలర్గా మహమ్మద్ సిరాజ్ రికార్డు లోకి ఎక్కాడు. అతి తక్కువ కాలంలోనే టీమిండియాలో అగ్రస్థానాన్ని సంపాదించుకున్నాడు మహమ్మద్ సిరాజ్.
Mohammed Siraj is dating popular TV actress
అయితే ఈ మధ్యకాలంలో టీమిండియా జట్టులో స్థానం కోల్పోయిన మహమ్మద్ సిరాజ్ రంజిత్రోఫీలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్ గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్నటి వరకు ప్రముఖ సింగర్ జనై తో మహమ్మద్ సిరాజ్ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలను.. జనై అలాగే సిరాజ్ ఇద్దరు కూడా కొట్టివేశారు. ఇలాంటి నేపథ్యంలో బిగ్ బాస్ బ్యూటీ… మహీర శర్మతో మహమ్మద్ సిరాజ్ డేటింగ్ చేస్తున్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అంటున్నారు. అయితే ఈ వార్తలు గుప్పుమనడంతో మహీరా శర్మ తల్లి స్పందించారు. సిరాజ్ అలాగే మహిరా శర్మ మధ్య ఎలాంటి సంబంధాలు లేవని… ఆమె క్లారిటీ ఇచ్చారు.