Mohan Babu bail rejected: మోహన్ బాబు అరెస్ట్ కు రంగం సిద్ధం..మంచు ఫ్యామిలీ కి షాక్ ఇచ్చిన కోర్టు!!
Mohan Babu bail rejected: మోహన్ బాబు కుటుంబం లో జరుగుతున్న వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.త మూడు రోజులుగా మంచు ఫ్యామిలీలో వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు మరియు ఆయన కుమారుడు మంచు మనోజ్ పరస్పరం పోలీసు కేసులు పెట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా నిలిచింది. ఈ సంఘటన మంచు వారి కుటుంబానికి చెందిన పలు అనుమానాలను రేకెత్తించింది. అభిమానులు, ప్రజలు ఈ వివాదం పరిష్కారం ఎలా జరుగుతుందనే ఆశతో ఉన్నారు.
Mohan Babu bail rejected by court
అయితే ఈ వివాదం జర్నలిస్ట్ లను కొట్టేదాకా వెళ్ళింది. దాంతో పలువురు జర్నలిస్ట్ లు మోహన్ బాబు పై కేసు పెట్టారు. అయితే ఈ కేసులో మోహన్ అరెస్ట్ ఖాయమయ్యేలా కనిపిస్తుంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కు కూడా హై కోర్టు కొట్టివేసింది, ఇది మోహన్ బాబుకు పెద్ద షాక్ గా మారింది. ఈ నిర్ణయంతో, మోహన్ బాబును అరెస్ట్ చేసే సూచనలు కూడా వెలువడుతున్నాయి. ఈ కేసు పరిస్థితి మోహన్ బాబుకు గట్టి సవాలుగా మారింది.
Also Read: Tamannaah Bhatia: పాక్ క్రికెటర్ తో తమన్నా పెళ్లి.. అప్పట్లో తెగ వైరల్ అయిన న్యూస్!!
ఇకపోతే మోహన్ బాబు ఒక మీడియా రిపోర్టర్ పై అమానుషంగా దాడి చేయడం మరియు బూతులు మాట్లాడడంపై మోహన్ బాబు తాజాగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. “నేను గత 48 గంటలుగా హాస్పిటల్ లో ఉన్నాను, అందుకే ఆ సంఘటనపై వెంటనే స్పందించలేకపోయాను” అని ఆయన చెప్పారు. “ఆ హీట్ మూమెంట్ లో, నా ఇంటి గేటును బద్దలు కొట్టి, దాదాపు 30 నుండి 50 మంది వచ్చారు.
ఈ పరిస్థితిని చూసి నేను నా సహనం కోల్పోయాను. ఆ సమయంలో జరిగిన దాడి గురించి నేను చాలా విచారిస్తున్నాను” అని ఆయన తెలిపారు. మోహన్ బాబు ఆ ఛానెల్ వారికి మరియు ఆ రిపోర్టర్ కుటుంబానికి కూడా క్షమాపణలు తెలిపారు.