Mohan Babu: అన్ని గొడవలకు కోడలే కారణం..7 నెలల మనవరాలిని పనిమనిషికి ఇచ్చి..?
Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. మంచు మోహన్ బాబు నట వారసులుగా ఇండస్ట్రీలోకి మంచు మనోజ్, మంచు విష్ణు, కూతురు మంచు లక్ష్మి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇందులో ఎవరు కూడా స్టార్ నటులుగా ఎదగలేకపోయారు. ఈ తరుణంలో మోహన్ బాబుకు కూడా వయసు మీద పడి ఆఫర్లు కూడా తగ్గిపోవడంతో ఇంటి వద్ద ఉన్న బిజినెస్ లు చూసుకుంటూ బ్రతుకుతున్నారు.

Mohan Babu: Daughter-in-law is the reason for all the quarrels
ఇదే తరుణంలో మోహన్ బాబు ఫ్యామిలీలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసిగిపోయిన మోహన్ బాబు తాజాగా రాచకొండ కమిషనరేట్ కు వెళ్లి ఫిర్యాదు కూడా చేశారట. నా కుమారుడు మనోజ్ అతని భార్య మౌనిక వల్ల మాకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నా ఆస్తులకు రక్షణ కల్పించాలని, నేను జల్పల్లిలో 10 సంవత్సరాలుగా నివసిస్తున్నానని, నాలుగు నెలల కిందట నా చిన్న కొడుకు ఇంటిని విడిచిపెట్టి వెళ్లాడని పేర్కొన్నారు. (Mohan Babu)
Also Read: Manchu Mohan Babu: పిచ్చ కొట్టుడు కొట్టుకున్న మంచు మనోజ్ మోహన్ బాబు .. పోలీస్ స్టేషన్లో కేసు.?
ఇక నా కొడుకు మనోజ్ కొందరు సంఘ వ్యతిరేక శక్తులతో కలిసి నాపై దౌర్జన్యం చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. అలాగే మనోజ్ తన ఏడు నెలల కుమార్తెను ఇంటి పనిమనిషి వద్దే వదిలి వెళ్లాడని తెలియజేశారు. మాదాపూర్ లోని తన కార్యాలయంలోకి ఇప్పటికే 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరింపులకు గురిచేస్తూ, నా ఇంటిని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని తెలిపారు.

నా భద్రత విలువైన వస్తువులు ఆస్తుల విషయంలో నేను చాలా భయపడిపోతున్నానని, వారి నుంచి నాకు ప్రాణహాని ఉందని నాకు రక్షణ కల్పించాలని కోరారు. అంతేకాకుండా 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ ను కాబట్టి మనోజ్, మౌనిక వారి సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. అలాగే నా ఆస్తుల నుంచి మనోజ్ మౌనికాలను పూర్తిగా తొలగించాలని నాకు అదనపు భద్రత కల్పిస్తూ సిబ్బందిని కేటాయించాలని మోహన్ బాబు పేర్కొన్నారు.(Mohan Babu)