Mohan Babu: మంచు ఫ్యామిలీకి షాక్.. ఇండస్ట్రీ నుంచి మోహన్ బాబు బ్యాన్ .?
Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీల్లో మంచు ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ ఫ్యామిలీ నుంచి హీరోగా మంచు మోహన్ బాబు అత్యంత పేరు సంపాదించుకున్నారు. కలెక్షన్, డైలాగ్ కింగ్ గా పేరు సంపాదించుకున్నటువంటి మోహన్ బాబు ఎన్నో చిత్రాల్లో నటించి తనకు ఎదురులేదనిపించుకున్నారు. ఒకప్పుడు మోహన్ బాబు సినిమా థియేటర్లోకి వచ్చింది అంటే జనాలు ఎగబడుకుంటూ వెళ్లి చూసేవారు. అలాంటి మోహన్ బాబు పరిస్థితి ప్రస్తుత కాలంలో చాలా దారుణంగా తయారవుతుంది.

Mohan Babu is banned from the industry
కుటుంబ సమస్యల వల్ల ఆయన అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి అంత వయసు వచ్చిన ఓపికతో ఉండకుండా కుర్రాళ్ళలాగే ప్రవర్తిస్తూ తన పరువు తానే తీసుకుంటున్నాడు. సినిమాల్లో విలన్ పాత్రల్లో ఏ విధంగా నటించాడో నిజ జీవితంలో కూడా విలన్ గా చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈ మధ్యకాలంలో మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరి మీద ఒకరు దాడి చేసే పరిస్థితికి వచ్చేసారు. ప్రతి కుటుంబంలో తగాదాలు కామనే కానీ, ఇంత పెద్ద బడా ఫ్యామిలీ అయి ఉండి నలుగురిలో మాట్లాడుకోవాల్సిన విషయాలు పదిమందిలోకి వచ్చేలా చేస్తున్నారు మోహన్ బాబు..(Mohan Babu)
Also Read: Soundarya: మంచు ఫ్యామిలీలోని అందరి కన్ను సౌందర్య బంగ్లా మీదే.. 100 కోట్ల వ్యాల్యూ.?
ఏకంగా అన్నదమ్ములు, తండ్రి కొడుకుల మధ్య వివాదం ఏర్పడడంతో ఒకరికొకరు పరస్పర దాడులు కూడా చేసుకుంటున్నారు. ఇదే తరుణంలో ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపై కూడా దాడులు చేసి దారుణంగా గాయపరిచారు మోహన్ బాబు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో ఆయనపై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఒక మీడియా ప్రతినిధిపై దాడి చేయడం దారుణం అంటూ ప్రశ్నిస్తున్నారు.

అంతే కాదు మోహన్ బాబు మానసిక పరిస్థితి ఎలా ఉందో అని సందేహ పడుతున్నారు. ఇక మీడియా ప్రతినిధులనే ఈ విధంగా కొట్టాడు, అంటే సామాన్య వ్యక్తులను ఆయన ఏ విధంగా ట్రీట్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ టాపిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవ్వడంతో మంచు ఫ్యామిలీని పూర్తిగా ఇండస్ట్రీ నుంచి తొలగించాలని కొంతమంది వార్తలు రాయడం మొదలుపెట్టారు. ఇలాంటి ఫ్యామిలీ వారికి మా అధ్యక్ష పదవి కూడా అవసరం లేదని కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి ఈ ఫ్యామిలీ వివాదం ఎక్కడెక్కడికి దారితీస్తుందో ముందు ముందు తెలుస్తుంది..(Mohan Babu)