Soundarya: సౌందర్య ఆస్తి కొట్టేసిన మోహన్ బాబు.. సంచలన నిజం బయటపెట్టిన నిర్మాత.?

Soundarya: సౌందర్య మోహన్ బాబు వివాదం రోజురోజుకి ఎంత ఎక్కువ అవుతుందో చెప్పనక్కర్లేదు. అయితే సౌందర్య బతికి లేకపోయినప్పటికీ కొంతమంది సౌందర్య ఆస్తిని మోహన్ బాబు కాజేసారని ప్రత్యక్ష సాక్షులం అన్నట్లుగా మోహన్ బాబు పై పోలీస్ స్టేషన్లలో కేసులు వేస్తున్నారు. అంతేకాదు సౌందర్య చనిపోయి దాదాపు రెండు దశాబ్దాలు అయ్యాక సౌందర్య మరణానికి కారణం మోహన్ బాబే అంటూ ఓ వ్యక్తి మోహన్ బాబు పై కేసు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.
Mohan Babu who stole Soundarya assets
అంతే కాదు ఆస్తి కోసమే మోహన్ బాబు సౌందర్యను మర్డర్ చేయించారంటూ కూడా ఆయన చెప్పారు. ఇదంతా పక్కన పెడితే..తాజాగా నిర్మాత నట్టి కుమార్ సౌందర్య ఆస్తి మోహన్ బాబు కొట్టేయడం గురించి సంచలన నిజాలు బయటపెట్టారు. నట్టి కుమార్ మాట్లాడుతూ.. సౌందర్య ఆస్తిని మోహన్ బాబు కొట్టేశారు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సౌందర్య కి హైటెక్ సిటీలో ఉన్న స్థలాలు కొంతమంది రౌడీలు కబ్జా చేస్తే ఆ రౌడీల బారి నుండి సౌందర్య ఆస్తిని కాపాడింది పరిటాల రవి, మోహన్ బాబు గార్లే.. (Soundarya)
Also Read: Ester: డబ్బు కోసమే వ్యభిచారం..షాకింగ్ కామెంట్స్ చేసిన ఎస్తేర్.?
వీరిద్దరే స్వయంగా రంగంలోకి దిగి సౌందర్య ఆస్తిని మళ్ళీ తిరిగి ఆమెకు అప్పగించారు. లేకపోతే ఆనాడే సౌందర్య ఆస్తి రౌడీల కబ్జాకు బలయ్యేది.అలా సౌందర్యకు వీలైనంతవరకు సహాయం చేసిన మోహన్ బాబు పై ఇలాంటి రూమర్లు తగదు. సౌందర్య ఆస్తిని మోహన్ బాబు కొట్టేసారు అనేదాంట్లో ఎలాంటి నిజం లేదు.అలాగే ఆమె మరణానికి కారణం కూడా మోహన్ బాబు కాదు.

ఈ విషయం గురించి సౌందర్య భర్తే వచ్చి నిజం చెప్పినా కూడా ఈ రూమర్లు ఆగడం లేదు.సౌందర్యకి చనిపోయే వరకు కూడా అందరితో మంచి స్నేహమే ఉంది. అలా మోహన్ బాబుతో కూడా సౌందర్యకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు.అలాగే మోహన్ బాబు సౌందర్య ఆస్తిని కొట్టేయాలని ఎప్పుడూ చూడలేదు అంటూ సంచలన నిజాలు బయటపెట్టారు నిర్మాత నట్టి కుమార్.(Soundarya)