Mohan Babu: బయటికి వచ్చిన మోహన్ బాబు వీలునామా.. పాపం మనోజ్ కి అన్యాయం.. అందుకే గొడవ.?
Mohan Babu: మంచు ఫ్యామిలీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి ఈ ఫ్యామిలీ ఒక్కసారిగా రోడ్డున పడ్డట్టు అయిపోయింది. మోహన్ బాబుకు మరియు మంచు మనోజ్ కు వచ్చిన గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. మోహన్ బాబు మీడియాపై దాడి చేయడం తర్వాత సారీ చెప్పడం ఇలా ఎన్నో వివాదాలకు దారి తీసింది.

Mohan Babu will came out
అలాంటి ఈ తరుణంలో తాజాగా ఒక వీలునామా సంబంధించినటువంటి పత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి అందులో ఏముంది ఆ వివరాలు ఏంటో చూద్దాం.. మంచు మనోజ్ మోహన్ బాబుపై కేసు పెడితే మోహన్ బాబు మనోజ్, కోడలిపై కూడా కేసు పెట్టారు. ఇలా మొదలైన వీరి గొడవ వీలునామా వరకు వెళ్లిందట.. అందులో ఏముంది అయ్యా అంటే.. మోహన్ బాబు తన కూతురు లక్ష్మి కి ఫిలిం నగర్ లోని ఒక ఇంటిని రాసి ఇచ్చారట. (Mohan Babu)
Also Read: Manchu Lakshmi Post: మోహన్ బాబు కుటుంబ కలహాలు.. మనోజ్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మంచు లక్ష్మీ!!
అంతేకాకుండా మరికొన్ని ఆస్తులు కూడా ఇచ్చినట్టు సమాచారం. అలాగే మంచు మనోజ్ కు హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి ఇండ్లతో పాటు మరికొన్ని ఆస్తులను రాసిచ్చారట. తిరుపతిలో ఉన్న శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలతో పాటు, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ వంటి ఆస్తులను మంచు విష్ణుకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మోహన్ బాబు జల్లిపల్లి లోని ఫామ్ హౌస్ తన పేరు మీద ఉంచుకున్నారట.

అంతేకాకుండా తన సొంత ఊరిలో వ్యవసాయ భూములు, తిరుపతిలోని కొన్ని ఫ్లాట్లు హైదరాబాదులోని ప్రాంతాల్లోని ఇండ్లు తన పేరు మీద ఉంచుకున్నట్టు తెలుస్తోంది.. ఈ క్రమంలో మనోజ్ ఇంత గొడవ చేయడానికి ప్రధాన కారణం జల్లిపల్లిలోని ఫామ్ హౌస్ అని సమాచారం. అయితే ఇది తన పేరు మీద చేయాలని ఆయన పట్టుబట్టడంతో మోహన్ బాబు ససేమీరా అన్నారట. దీంతో గొడవ మొదలై ఇంత పెద్ద రాద్ధాంతం అయింది.. ప్రస్తుతం ఆ గొడవలు సర్దుకున్నట్టు తెలుస్తోంది.. ఏది ఏమైనా ఎంతో డీసెంట్ గా ఉండే ఈ ఫ్యామిలీ ఆస్తుల వివాదంలో బయటకు రావడం దారుణమనే చెప్పాలి.(Mohan Babu)