Monalisa: కుంభమేళా సెన్సేషన్..మోనాలిసా చేయబోయే తొలి సినిమా ఎదో తెలుసా?

Monalisa Gets First Bollywood Role Offer

Monalisa: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా భోస్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె అందం, ప్రత్యేక శైలితో సందడి చేసిన విధానం నెటిజన్లను ఆకట్టుకొని ఆమె రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయెలా చేసింది. ఆమెను చూసేందుకు అనేక మంది అభిమానులు, సందర్శకులు ఫొటోలు, వీడియోలు దిగేందుకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమెకి ఆమె రక్షణని తగిన సౌకర్యాలు లేకుండా పోయాయి, దీంతో ఆమె తండ్రి ఆమెను వెనక్కి తీసుకుని వెళ్లారు.

Monalisa Gets First Bollywood Role Offer

కుంభమేళాలో మోనాలిసా యొక్క ప్రచారం జరిగింది. అయితే మోసాలిసాకు వ్యాపారం చేయడానికి అనేక రుఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఆమె ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్‌ అయ్యాయి. దాంతో ఆమెకు ఫాలోయింగ్ పెరిగి పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతల చూపు పడింది. ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ముందకు వచ్చారు. ఆ విధంగానే మోనాలిసా ప్రస్తుతం బాలీవుడ్‌ తొలి చిత్రం చేస్తుంది. ‘‘ది డైరీ ఆఫ్ మణిపూర్’’ అనే చిత్రంలో ఆమె న‌టించేందుకు ఆఫ‌ర్‌ను సనోజ్ మిశ్రా ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో, సనోజ్ మిశ్రా మోనాలిసా నివసించే ఇండోర్‌కు వెళ్లి ఆమె కుటుంబంతో చ‌ర్చలు జరిపారు. చిత్రానికి అంగీకార పత్రంలో సంతకం తీసుకున్న అనంత‌రం, ముంబైలో ఆమెకి యాక్టింగ్‌ క్లాస్‌లు నేర్పించనున్నారు. ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు సోదరుడు అమిత్ రావు నటించనున్నట్లు స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *