Mobiles: బాత్రూంలో ఫోన్లు వాడుతున్నారా… అయితే..ఈ కొత్త వ్యాధులు?
Mobiles: నేటి కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఫోన్లు వాడకం ఎక్కువ అయిపోయింది. కొంతమంది అయితే బాత్రూంలో కూడా ఫోన్లను విడిచి ఉండడం లేదు. బాత్రూమ్స్ లోకి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడం వల్ల ఎక్కువ సమయం బాత్రూంలో గడుపుతున్నారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. మొబైల్ చూస్తూ టాయిలెట్ లో ఎక్కువ సమయం గడిపినట్లయితే కండరాలు బలహీన పడతాయి. భవిష్యత్తులో ఆనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. Mobiles
Most people use phones in the bathroom
మొబైల్ ఫోన్ చూస్తూ టాయిలెట్ లో ఉండడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. దీనివల్ల రక్తప్రసరణలో అనేక సమస్యలు ఏర్పడతాయి. గంటల తరబడి టాయిలెట్స్ సీటుపై కూర్చొని మొబైల్ ఫోన్ వాడినట్లయితే కండరాలపై ఒత్తిడి పెరిగి పైల్స్, అవాంచిత రక్తస్రావం సమస్యలు ఏర్పడతాయి. గుండె, కిడ్నీలపై ప్రభావం పడుతుంది. శరీరం సాధారణంగా పనిచేయాలంటే తక్కువ సమయం టాయిలెట్లో ఉండాలి. Mobiles
Also Read: Ms Dhoni: RCBపై కోపంతో..టీవీ పగలగొట్టిన ధోనీ ?
టాయిలెట్ లో కూర్చుని మొబైల్ వాడకం తగ్గించినట్లయితే అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫోన్లు ఎక్కువగా వాడినట్లయితే మెదడు, నరాలు చిట్లిపోతాయి. అంతేకాకుండా గుండె సమస్యలు ఏర్పడతాయి. రక్త ప్రసరణ సజావుగా సాగదు. చిన్నపిల్లలకు ఫోన్లను అస్సలు చూపించకూడదు. దానివల్ల వారి పెరుగుదలలో అనేక లోపాలు ఏర్పడతాయి. అంతేకాకుండా కంటి పోర దెబ్బతింటుంది. చిన్నపిల్లలకు సాధారణంగా ఫోన్లు చూపించకపోవడమే మంచిదని నిపుణులు సూచనలు చేస్తున్నారు. Mobiles