Sreeja: మెగా డాటర్ శ్రీజ లవ్ స్టోరీతో సినిమా.. ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఏంటంటే.?
Sreeja: మెగా డాటర్ శ్రీజ లేచిపోయి పెళ్లి చేసుకున్న మ్యాటర్ అప్పట్లో మీడియాలో ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా ఇండస్ట్రీలో మెగా డాటర్ శ్రీజ మెగా ఫ్యామిలీ పరువు మొత్తం తీసేసింది. తల్లిదండ్రులు తమ ప్రేమని వ్యతిరేకిస్తున్నారని,మా ప్రేమకు వాళ్లే శత్రువులు అంటూ పెద్ద రచ్చ సృష్టించింది. అలా ఎట్టకేలకు మెగా ఫ్యామిలీ పరువు మొత్తం తీసి శిరీష్ భరద్వాజ్ ని ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుంది.
Movie with mega daughter Sreeja love story
2007లో పెళ్లి చేసుకున్న శ్రీజ 2014లో మొదటి భర్తతో విడిపోయింది.అయితే ఈ పెళ్లి విషయం కాస్త పక్కన పెడితే..శ్రీజ లేచిపోయి పెళ్లి చేసుకున్న స్టోరీ తో ఓ సినిమా కూడా వచ్చిందట. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది.మరి ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పరుగు.. భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పరుగు సినిమాలో శీలా కౌర్ బన్నీకి హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా చేశారు.. (Sreeja)
Also Read: Ram Charan: ఉపాసన అంటే చిరాకు.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్.?
లేచిపోయి పెళ్లి చేసుకున్న కూతురు గురించి బాధపడి పరువు మొత్తం తీసేసింది అంటూ బాధపడే పాత్రలో ప్రకాష్ రాజ్ ని చూపించారు. ఇక ఈ సినిమా స్టోరీ అచ్చం శ్రీజ లేచిపోయి పెళ్లి చేసుకున్నట్లే ఉండడంతో చాలామంది శ్రీజా లేచిపోయి పెళ్లి చేసుకున్న స్టోరీనే డైరెక్టర్ భాస్కర్ పరుగు సినిమా రూపంలో తెరకెక్కించారని అప్పట్లో చాలా మంది మాట్లాడుతున్నారు.ఎందుకంటే 2007లో శ్రీజ పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత సంవత్సరానికే అల్లు అర్జున్ పరుగు సినిమాతో వచ్చారు.
దీంతో పరుగు సినిమాకి శ్రీజ లేచిపోయి పెళ్లి చేసుకున్న స్టోరీకి మధ్య లింకప్ చేస్తూ పరుగు మూవీ స్టోరీని శ్రీజ లేచిపోయి పెళ్లి చేసుకున్న దాన్ని అనుసంధానంగా చేసుకొనే ఈ సినిమా తెరకెక్కించారని అప్పట్లో చాలా మంది మాట్లాడుకున్నారు. ఇక పరుగు మూవీ లో ప్రకాష్ రాజ్ ఎలా అయితే బాధ పడ్డారో రియల్ లైఫ్ లో శ్రీజ పెళ్లి చేసుకుంటే కూడా చిరంజీవి అలానే పరువు పోయిందని బాధ పడ్డారు.(Sreeja)