Mumaith Khan: ముమైత్ ఖాన్ సీక్రెట్ డేటింగ్.. ఏకంగా నలుగురితో.?
Mumaith Khan: ప్రస్తుత కాలంలో అన్ని పాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయి. కథ కంటెంట్ తో పాటు, పాటల విషయంలో కూడా దర్శక నిర్మాతలు కాంప్రమైజ్ కావడం లేదు. ఎంత ఖర్చైనా పెట్టి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్లు ఒకేత్తయితే, అదే చిత్రంలో స్పెషల్ సాంగ్స్ మరో ఎత్తు. ఈ స్పెషల్ సాంగ్స్ కోసమే కొంతమంది స్పెషల్ హీరోయిన్లను తీసుకుంటున్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐటెం సాంగ్స్ కు బ్రాండ్ గా మారిన ముమైత్ ఖాన్ అంటే తెలియని వారు ఉండరు.
Mumaith Khan secret dating
అప్పట్లో ఏ సినిమా వచ్చిన ఈమె స్పెషల్ సాంగ్ తప్పనిసరిగా ఉండేది.. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే, ఓరోరి యోగి నన్ను కోరికెయిరో అంటూ స్పెషల్ డాన్స్ తో అదరగొట్టింది ముమైత్ ఖాన్.. ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చి చివరికి హాట్ బ్యూటీగా ఐటమ్ గర్ల్ గా మారిపోయింది.. అలాంటి ఈమె స్పెషల్ సాంగ్స్ చేసి బాగానే సంపాదించింది. కానీ ముమైత్ ఖాన్ ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. (Mumaith Khan)
Also Read: Tandel Movie: తండేల్ సినిమాపై స్టార్ హీరో కుట్రలు..?
ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ, బెంగాల్, మలయాళ, భాషల్లో కూడా ఎన్నో చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది.. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైప్ గురించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది.. తనకు ఒక యాక్సిడెంట్ కావడం వల్ల ఇంటికి పరిమితమయ్యానని చెప్పింది.. ప్రస్తుతం ఆరోగ్యం సెట్ అయింది. సినిమా ఆఫర్లు కూడా అనేకం వస్తున్నాయి కానీ నాకు వ్యాపారం చేయాలని ఆలోచన ఉంది అంటూ తెలియజేసింది.
ఇదే సందర్భంలో యాంకర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడగ్గ నాకు సరైన వ్యక్తులు దొరకలేదని, ఇప్పటికి నలుగురితో డేటింగ్ చేశానని కానీ ఎవరితో నాకు సరిగా వర్కౌట్ అవ్వలేదని తెలియజేసింది.. ఆ నలుగురితో నేను జన్యుడిగా ఉండడం వల్లే నాకు సెట్ కాలేదని అన్నది.. పెళ్లి పిల్లలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పకనే చెప్పేసింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.(Mumaith Khan)