Naga Chaitanya in Tandel : ఈ సారైనా నాగ చైతన్య సాయి పల్లవిని డామినేట్ చేసేనా?
Naga Chaitanya Mass Avatar: టాలీవుడ్‌లో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న లేటెస్ట్ సినిమాల్లో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా, నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంతో చైతు థియేట్రికల్‌గా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు.
Naga Chaitanya Mass Avatar in Tandel
సాయి పల్లవి నటించిన గత చిత్రాల్లో ఎక్కువగా ఆమెకు మంచి క్రెడిట్ దక్కింది. కానీ తండేల్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ సినిమాలో నాగ చైతన్య పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో, అతనే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా చైతన్య మాస్ యాంగిల్‌ను హైలైట్ చేస్తుందని, పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీజర్, పాటలు, ట్రైలర్ అన్నీ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. యాక్షన్, ఎమోషన్, మ్యూజిక్ అన్నీ కలిపి గ్రాండ్ విజువల్స్‌తో రూపొందించిన ఈ చిత్రం, నాగ చైతన్య కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవనుంది. రిలీజ్‌కు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలుండటంతో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా థియేటర్స్‌లోకి వచ్చిన తర్వాత ఈ తండేల్ మ్యాజిక్ ఎలా ఉండబోతుందో చూడాలి.