Naga Chaitanya: సమంతతో డివోర్స్.. ప్రతీ నెల 3 లక్షలు కట్టకపోతే..?
Naga Chaitanya: నాగచైతన్య సమంత విడాకులపై వీళ్లు పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఎదురవుతుంది.అలా తాజాగా తండేల్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో కూడా నాగచైతన్యకు సమంతతో ఎందుకు విడిపోయారు అంటూ ఒక ప్రశ్న ఎదురైంది. అయితే దీనికి కారణం చెప్పిన నాగచైతన్య ఇప్పటినుండి ఈ వార్తలు అడగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ రిక్వెస్ట్ చేశారు.అలాగే విడాకులు తీసుకున్నందుకు నేను ఏమి క్రిమినల్ ని కాదు..నన్ను అలాగే చూస్తున్నారు అని కూడా మాట్లాడారు.

Naga Chaitanya Shocking Comments
అయితే ఇదే ఇంటర్వ్యూలో నెలకి మూడు లక్షలు ఇవ్వాల్సిందే అంటూ నాగచైతన్య మాట్లాడడంతో చాలామంది ఈ విషయం తెలిసి సమంత కి విడాకులు ఇచ్చినందుకు నాగచైతన్య నెలకు 3 లక్షలు భరణం కింద ఇస్తున్నారు కావచ్చు అని అందరూ అనుకుంటున్నారు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మరి ఇంతకీ నాగచైతన్య 3 లక్షల మేటర్ ని ఎందుకు మాట్లాడారు అంటే పిఆర్టీం..నెలకు 3 లక్షల పిఆర్టిఎంకి ఖర్చు పెట్టకపోతే మనం సినిమాలు ఎన్ని చేసినా వేస్టే అంటూ నాగచైతన్య మాట్లాడారు. (Naga Chaitanya)
Also Read: Tamannaah: కారవాన్ లో చీకటి బాగోతం.. ఆ పని కోసం తమన్నాని టార్చర్ చేసి.?
నాకు ఈ రాజకీయాలు తెలియదని, గతంలో సినిమా షూటింగ్ చేశామా.. ఇంటికి వచ్చామా.. విడుదల అయిందా..అనే లాగే ఉండేవాడిని. కానీ నేను ఆలస్యంగా పి ఆర్ యాక్టివిటీలోకి అడుగుపెట్టాను.ఇప్పుడిప్పుడే నాకు పిఆర్ రంగం గురించి పూర్తిగా తెలుస్తోంది. కనీసం నెలకి మూడు లక్షలు ఇవ్వకపోతే మన పేరు ఎక్కడ వినిపించదు. మన సినిమాలు ప్రమోట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పిఆర్ టీం కి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఒకవేళ అంత డబ్బు ఖర్చు పెట్టకపోతే సినీ ఇండస్ట్రీలో రాణించలేం.

అయితే పిఆర్ టీమ్ ద్వారా సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడకునేలా చేయడం మంచి పద్ధతే..కానీ కొంతమంది మాత్రం వేరే వాళ్ళని తొక్కేయడం కోసం అసత్య ప్రచారాలు కూడా చేస్తారు. పక్కనోడిని తొక్కేసే బదులు ఆ సమయాన్ని మనం మరింత ఎదిగేలా చేసుకోవడం మంచిది. పక్కనోళ్ళపై అసత్య ప్రచారాలు చేయడాన్ని నేను తప్పుపడుతున్నాను అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చారు.(Naga Chaitanya)