Naga Chaitanya: నా లైఫ్ లో అది పోయింది.. మళ్లీ ఎందుకు గెలుకుతారు.. సమంతపై చైతూ షాకింగ్ కామెంట్స్.?
Naga Chaitanya: నా లైఫ్ నుండి పోయాక కూడా మళ్లీ మానిపోయిన గాయాన్ని ఎందుకు గెలుకుతారు అంటూ నాగచైతన్య ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.మరి ఇంతకీ నాగచైతన్యకు అంత కోపం ఎందుకు వచ్చింది..సమంత గురించి ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం.సినిమా హిట్ అవ్వడంతో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత వేగవంతం చేశారు.టైం దొరికితే చాలు సినిమాకి సంబంధించి తెగ ప్రమోట్ చేసుకుంటున్నారు చిత్ర యూనిట్. ఇక ఇందుకు సంబంధించి ఓ ప్రమోషన్ లో నాగచైతన్య పాల్గొన్న సమయంలో సమంత పై విడాకుల గురించి మళ్లీ ప్రశ్నించారు.

Naga Chaitanya shocking comments on Samantha
అయితే ఈ ప్రశ్నపై అసహనం వ్యక్తం చేసిన నాగచైతన్య ఎందుకు మళ్ళీ మళ్ళీ మానిపోయిన గాయాన్ని గెలుకుతున్నారు.మేం విడాకులు తీసుకున్న సమయంలో మా మీద ఎన్నో నెగటివ్ కామెంట్లు చేశారు. నేను ఒక పోస్ట్ చేస్తే చాలు దాని కింద ఎన్నో నెగటివ్ కామెంట్లు వచ్చేవి. అలాగే నేను ఎక్కడికి వెళ్లినా కూడా నన్ను ఈ ప్రశ్న అడిగారు. ఎన్నిసార్లు వద్దని రిక్వెస్ట్ లు పెట్టినా కూడా మళ్లీ అదే ప్రశ్న అడుగుతూ మానిపోయిన గాయాన్ని మళ్లీ గెలుకుతున్నారు. (Naga Chaitanya)
Also Read: Thandel: తండేల్ సినిమాని మిస్ చేసుకున్న దురదృష్టవంతుడు ఆ హీరోనేనా.?
మేం ఎన్నోసార్లు ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం అయితే కాదు. ఒకటి వెయ్యి సార్లు ఆలోచించాకే ఇద్దరం కలిసి ఉండడం కుదరదు అని విడాకులు తీసుకున్నాం. విడాకుల విషయంలో మా ఇద్దరికీ ఇష్టం ఉన్నాక బయటి వాళ్ళ నెగిటివ్ కామెంట్లు ఏంటో నాకు అర్థం అవడం లేదు.ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది.అయినా ప్రపంచంలో నేను ఒక్కడినే విడాకులు తీసుకున్నానా..

నన్ను ఒక క్రిమినల్ ని చూసినట్టు చూస్తున్నారు నేనేమీ తప్పు చేయలేదు కదా బ్రేకప్ తర్వాత ఆ బాధ ఏంటో నాకు తెలుసు. కానీ మళ్ళీ మళ్ళీ గాయాన్ని గిచ్చి మరింత బాధ పెడుతున్నారు అన్నట్లుగా నాగచైతన్య మాట్లాడారు. అలాగే తన లైఫ్ లో శోభితనే అసలు హీరో అని చెప్పుకొచ్చారు నాగచైతన్య.(Naga Chaitanya)