Naga Chaitanya: ఇంట్లో పెత్తనమంతా శోభితదే అమల కూడా వేస్టేనా..?
Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా తండేల్.. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కాబోతుండడంతో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచారు.అయితే తాజాగా జనవరి 28న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా వైజాగ్ లో చేశారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సాయి పల్లవి హాజరు కాలేదు. దానికి ప్రధాన కారణం ఆమె తీవ్రమైన దగ్గు,జలుబు, జ్వరంతో బాధపడడం కారణంగా ఇంట్లోనే రెస్ట్ తీసుకోమని చెప్పారట.
Naga Chaitanya Shocking comments on Sobhita
అందుకే ఈవెంట్ కి హాజరు కాలేదు. అయితే ఈ ఈవెంట్ కి హాజరైన నాగ చైతన్య షాకింగ్ కామెంట్లు చేశారు.. నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను.ఎప్పుడైనా సరే నా సినిమా విడుదలయితే వైజాగ్ లో కలెక్షన్లు ఎలా ఉన్నాయి టాక్ ఎలా ఉంది అని అడుగుతాను. ఎందుకంటే వైజాగ్ లో సినిమా హిట్ అయితే ఎక్కడైనా హీట్ అవుతుంది అనే నమ్మకం నాకు ఉంది. (Naga Chaitanya)
Also Read: Jani Master: జానీ మాస్టర్ ఇక జైలుకే.. గెలిచామంటున్న ఝాన్సీ.!
అందుకే ఈసారి నా పరువు పోకుండా ఈ సినిమాని వైజాగ్ లో భారీ హిట్ చేయాలి. ఎందుకంటే ఈ సినిమా వైజాగ్ లో మంచి టాక్ లేకపోతే ఇంట్లో నా పరువు మొత్తం పోతుంది. నా ఇంట్లో వైజాగ్ ఉంది.. అలాగే నా ఇంట్లో పెత్తనం మొత్తం వైజాగ్ దే అంటూ నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్న శోభితది వైజాగే..
ఆ కారణంగానే వైజాగ్ ని ఓ రేంజ్ లో పొగుడుతూ నాగచైతన్య ఈ కామెంట్స్ చేశారు.అయితే ఇంట్లో పెత్తనం అంత శోభితదే నని నాగచైతన్య చెప్పడంతో చాలామంది నెటిజన్లు ఇంట్లో కొత్తకోడలుదే పెత్తనం అయితే శోభిత ముందు అమలా కూడా వేస్టేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనప్పటికీ వైజాగ్ లో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య మాట్లాడిన మాటలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.(Naga Chaitanya)