Naga Shaurya: డైరెక్టర్లను మారుస్తూ 40 కోట్లు మింగేసిన నాగశౌర్య..?

Naga Shaurya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్డం కోసం కష్టపడుతున్న హీరోలలో నాగశౌర్య కూడా ఒకరు.. అలాంటి ఈయన ఇండస్ట్రీలో పడుతూ లేస్తూ సినిమాల్లో దూసుకుపోతున్నారు. తాజాగా ఈ వ్యక్తి ఒక భారీ ప్రాజెక్టుతో మన ముందుకు రాబోతున్నారు.. ఇదే తరుణంలో ఈ సినిమాకు సంబంధించి ప్రొడ్యూసర్లు నాగశౌర్యను విపరీతంగా తిట్టుకుంటున్నారట.. అంతేకాదు ఆయనను చూసి లోలోపల భయపడుతున్నారట..

Naga Shaurya who swallowed 40 crores by changing directors

Naga Shaurya who swallowed 40 crores by changing directors

అయినా నాగశౌర్య ఓవర్ బిల్డప్ తో ఇప్పటికే తను చేస్తున్న సినిమా డైరెక్టర్ ను మార్చేసి 10 కోట్లు ఖర్చు చేయించారట. అంతేకాదు మరో కొత్త డైరెక్టర్ ను తీసుకొని ఇప్పటికే 30 కోట్ల వరకు ఖర్చు చేయించారని తెలుస్తోంది. మొత్తం ఇప్పటివరకు శౌర్య పేరిట 40 కోట్ల బడ్జెట్ అయిందని సమాచారం.. ఇంతకీ ఆయన చేస్తున్న సినిమా పేరు ఏంటయ్యా అంటే బ్యాడ్ బాయ్ కార్తీక్.. (Naga Shaurya)

Also Read: Allu Aravind Praises Nagachaitanya: నాగ చైతన్య కు ‘తండేల్’ కరెక్ట్ సినిమా.. ఇరగాదీశాడు – అల్లు అరవింద్!!

తాజాగా తన బర్త్డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయింది.. చిత్రానికి ముందుగా వర్మని డైరెక్టర్ గా తీసుకొని కొంత షూటింగ్ పూర్తయ్యాక అవుట్ ఫుట్ బాగా రాలేదని నాగశౌర్య డైరెక్టర్ ని మార్చేశారట. దీంతో మరో నాగశౌర్య మరో కొత్త డైరెక్టర్ రమేష్ ను తీసుకున్నారట. ప్రస్తుతం రమేష్ చేతులో 75% సినిమా పూర్తి చేసుకున్న కానీ చిత్రీకరణ ఎలా ఉందని చూద్దామంటే ప్రొడ్యూసర్లకు అసలు చూపించడం లేదని సమాచారం అందుతోంది.

Naga Shaurya who swallowed 40 crores by changing directors

దీంతో ఆయనకు 40 కోట్ల వరకు బడ్జెట్ పెట్టిన నిర్మాతలు లోలోపల దారుణంగా భయపడుతున్నారట. అసలే నాగశౌర్యకు మార్కెట్లో పేరు లేదు. దీనికి తోడు 40 కోట్ల బడ్జెట్ పెడితే మళ్లీ పెట్టిన అమౌంట్ వస్తుందా రాదా అని లోలోపల మదన పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా నాగశౌర్య వల్ల నిర్మాతలు నష్టపోతారా లేదంటే సినిమా కథ బాగుండి లాభాలు తెచ్చి పెడుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది..(Naga Shaurya)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *