Naga Vamsi: మెగా ఫ్యాన్స్ నన్ను తిట్టినా పర్లేదు డాకు మహారాజ్ ముందు వాల్తేరు వీరయ్య వేస్ట్.?

Naga Vamsi: తెలుగు సినిమా ఇండస్ట్రీలోని స్టార్ నిర్మాతల్లో నాగ వంశీ కూడా ఒకరు. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ పలు సంచలమైన కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటి నాగ వంశీ తాజాగా మెగాస్టార్ గమూవీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.. దీంతో మెగాస్టార్ అభిమానులు ఆయనపై ఫైర్ అయినట్టు తెలుస్తోంది.

Naga Vamsi: Waltheir Veerayya wastes in front of Daku Maharaj

Naga Vamsi: Waltheir Veerayya wastes in front of Daku Maharaj

కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నాగ వంశీ డాకు మహారాజ్ సినిమా గురించి ప్రెస్మీట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆంధ్రాలోని విజయవాడ లేదా మంగళగిరిలో జనవరి 8న చేయాలి అని ఫిక్స్ చేశాము. అలాగే హైదరాబాదులో జనవరి 2న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా చేస్తాం. (Naga Vamsi)

Also Read: Shankar dream: శంకర్ కు తెలుగు లో భారీ అవమానం.. వారసలు పట్టించుకోలేదా?

అలాగే జనవరి 4న అమెరికాలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపి అక్కడే ఓ సాంగ్ కూడా లాంచ్ చేయాలని చూస్తున్నాం. ఈ సినిమా జనవరి 12న విడుదల కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాకి డైరెక్టర్ బాబి మంచి విజువల్స్ ఇచ్చారు. ఇప్పటివరకు ఈ స్టోరీ ఎక్కడ కూడా చూసి ఉండరు.

Naga Vamsi: Waltheir Veerayya wastes in front of Daku Maharaj

అలాగే బాబి డైరెక్షన్లో వచ్చిన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కంటే డాకూ మహారాజ్ ఇంకా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్న పర్వాలేదు. కానీ డాకు మహారాజ్ సినిమా వాల్తేరు వీరయ్య కంటే బాగా తెరకెక్కించారు అంటూ సంచలన కామెంట్లు చేశారు ప్రొడ్యూసర్ నాగ వంశీ.(Naga Vamsi)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *