Naga Vamsi: రేవంత్ రెడ్డిని కెలికిన నాగ వంశీ.. నోటిదూల ఎక్కువే!
Naga Vamsi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుష్ప చేసిన రచ్చ ఇండస్ట్రీ మొత్తం ఇబ్బందులు పడేలా చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డిని పుష్ప సినిమా ఘటనలలోకి లాగడంతో ఆయనకు కోపం వచ్చి టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు ఉండవని చెప్పేశారు. దీంతో పుష్ప వల్ల సినిమా ఇండస్ట్రీ అంతా సఫర్ కావలసి వస్తోందని, ఆయనను ఎలాగోలా ఒప్పించాలని సకల ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా టికెట్ రేటు పెరిగితేనే పాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన సినిమాలు లాభపడతాయని లేదంటే నిర్మాతలు అప్పుల పాలు కావాల్సిందే అని అంటున్నారు.
Naga Vamsi who teased Revanth Reddy
ఇదే తరుణంలో తాజాగా నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు మరోసారి రేవంత్ రెడ్డిని గెలికినట్టు అయిపోయాయి.. గతంలో మాదిరిగానే సినిమా ఇండస్ట్రీ వారంతా కలిసి ప్రభుత్వాలను వారి గుప్పెట్లోకి వచ్చేలా చేసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి అలా కనిపించడం లేదు. సినిమా వాళ్లకు భయపడేది లేదని బెనిఫిట్ షోలు ఉండవని తెగేసి చెప్పేశారు. ఇలా టికెట్ ధరల విషయంలో సినిమా వాళ్ళు తర్జనభజన పడుతున్న తరుణంలో నిర్మాత దిల్ రాజ్ ఎలాగోలా రేవంత్ రెడ్డిని ఒప్పించాలని ఆలోచన చేస్తున్నారు..(Naga Vamsi)
Also Read: Suresh Nadia Relationship: సురేష్, నదియా రిలేషన్‌షిప్.. అప్పట్లో తెగ నడిచిందా?
ఈ ప్రాసెస్ నడుస్తున్న తరుణంలో ఒక నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాకు రేవంత్ రెడ్డితో అవసరం ఏమి లేదు. టికెట్ ధరలు పెంచక పోయినా పర్లేదు. మా సినిమాలు నడుస్తాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ నిర్మాత ఎవరయ్యా అంటే సూర్యదేవరనాగ వంశీ. ప్రస్తుతం ఈయన డాకుమహారాజు సినిమాకు నిర్మాతగా ఉన్నారు. బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాకు టికెట్ ధరలు పెంచడం లేదంటూ క్లారిటీ ఇచ్చేశాడు.
ఈ సినిమా టికెట్ల ధరల విషయంలో మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్లలేదని స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా డాకు మహారాజ్ ఆడుతుందని తెలియజేశారు. ఇలా రేవంత్ రెడ్డిని ఒప్పించాలని సినిమా ఇండస్ట్రీ అంతా ప్రయత్నం చేస్తున్న తరుణంలో నిర్మాత ఈ విధమైన కామెంట్లు చేయడంతో సంచలనమైంది. మరి చూడాలి ఈ వ్యవహారం ఇంకెక్కడికి దారితీస్తుందో ముందు ముందు తెలుస్తుంది.(Naga Vamsi)