Nagababu: పుష్ప-2 రిలీజ్ వేళ ట్వీట్ చేసి మళ్లీ చిచ్చు పెట్టిన నాగబాబు..?
Nagababu: మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒక తీరు ఉంటే, నాగబాబు మరో తీరు ఉంటారు. తన ఇద్దరు అన్నదమ్ములపై ఒక్క మాటను కూడా పడనివ్వరు.. నిజానికి మెగా ఫ్యామిలీకి పెద్ద ఆర్మీల నాగబాబు ఉంటారని చెప్పవచ్చు. ఈ ఫ్యామిలీ విషయంలో ఎవ్వరు ఏమన్నా వారిపై త్వరగా రియాక్ట్ అయి వారిని చెడుగుడు ఆడేస్తారు. అలాంటి నాగబాబుకు అల్లు ఫ్యామిలీకి అస్సలు పడదు. ఎప్పుడు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా అల్లు ఫ్యామిలీ నుంచి హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఏ పని చేసినా నాగబాబు దానికి వ్యతిరేకంగా రియాక్ట్ అవుతూ ఉంటారు.
Nagababu who tweeted on the release of Pushpa-2
ఆ మధ్యకాలంలో అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో మెగా ఫ్యామిలీ మొత్తం కూటమిలో భాగంగా జనసేనకు, టిడిపికి సపోర్ట్ చేస్తే, ఇదే ఫ్యామిలీకి దగ్గర అయినటువంటి అల్లు అర్జున్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చ జరిగింది. అంతేకాకుండా ఓ సమావేశంలో పవన్ కళ్యాణ్ కూడా హీరోలే స్మగ్లింగ్ వంటి పాత్రలు చేస్తే సమాజం ఏమైపోవాలి అంటూ ప్రస్తావించారు. ఇద్దరు హీరోలు అల్లు అర్జున్ ను దృష్టిలో పెట్టుకొని అన్నారంటూ అల్లు అభిమానులంతా మండిపడ్డారు. అంతేకాదు వీటిపై అల్లు అర్జున్ కూడా స్పందిస్తూ వారికి కౌంటర్లు ఇస్తారు.. (Nagababu)
Also Read: Sai Pallavi: ఆ తప్పు నేను చేయలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి.?
మా తాత లేకుంటే ఆ ఫ్యామిలీ ఉండేది కాదంటూ ఆయన అంటూ ఉంటారు. ఇలా ఎప్పుడూ అల్లు మెగా ఫ్యామిలీ మధ్య రచ్చ కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా డిసెంబర్ 5వ తేదీన పుష్ప2 రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇదే తరుణంలో నాగబాబు మరో ట్వీట్ పెట్టి రచ్చ లేపాడు.. ఇంతకీ ఆయన సోషల్ మీడియా వేదికగా ఏం రాసుకొచ్చారయ్యా అంటే.. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావని నువ్వే గుర్తిస్తే మంచిది.. వెంటనే నీ దారిని మార్చుకో.. నువ్వు ఆలస్యం చేస్తే నీకే నష్టం.. దీన్ని గుర్తుపెట్టుకో.. ఆ తర్వాత నువ్వు ఎక్కడున్నావు అది మర్చిపోవద్దు..
లేకుంటే మళ్లీ మీరు మీ మూలాలను కలుసుకోవడం చాలా కష్టతరమవుతుంది అంటూ పరోక్షంగా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ కామెంట్లు పెట్టాడు. ఈ ట్విట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.. దీనిపై అల్లు అభిమానులు తీవ్రంగా రియాక్ట్ అవుతూ నాగబాబును తిట్టిపోస్తున్నారు. దీనిపై అల్లు అర్జున్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. కాని బన్నీ ఇవన్నీ పట్టించుకోకుండా పుష్ప2 సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు.(Nagababu)