Nagarjuna: “నా ఇంట్లో నుండి వెళ్లిపో”.. నాగచైతన్యకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..కారణం.?
Nagarjuna: ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్ డేట్స్ దగ్గరికి వస్తున్నాయి అంటే చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్ విషయంలో చాలా కసరత్తులు చేస్తున్నాయి. భారీగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకైతే దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాలపై అభిమానుల్లో మరింత బజ్ పెంచుతున్నారు. అలాంటి అనుస్టాపబుల్ షోకి ‘తండేల్’ చిత్ర యూనిట్ రాబోతున్నట్టు కొన్ని వార్తలు వినిపించాయి.

Nagarjuna gave a serious warning to Naga Chaitanya
కానీ ఆ షోకి నాగచైతన్య ను వెళ్ళొద్దని నాగార్జున వార్నింగ్ ఇచ్చారట. ఒకవేళ వెళ్ళినట్లయితే నా ఇంట్లో నుంచి నువ్వు వెళ్లిపోవాలని కూడా అన్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో, అబద్ధం ఉందో తెలియదు ..కానీ దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..అయితే తండేల్ సినిమా భారీ బడ్జెట్ తో బన్ని వాసు నిర్మించారు.(Nagarjuna)
Also Read: Balakrishna: బాలకృష్ణ పై పగ పెంచుకున్న ఇద్దరు కూతుర్లు.. చిన్నప్పటి నుండి అలా చేస్తారంటూ..?
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా అనుష్టాపబుల్ షోకి వెళ్లాలని అన్నారట. దీనికోసం నాగచైతన్య ఇతర దర్శక నిర్మాతలు రెడీ అయినట్టు కూడా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నాగార్జున ఆ షోకి నువ్వు వెళ్లొద్దని వెళ్తే బాగుండదని నాగచైతన్యకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.. దీంతో నాగచైతన్య చేసేది ఏమీ లేక నాన్న మాటకు కట్టుబడి సైలెంట్ గా ఉండిపోయారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

ఇక తండేల్ సినిమా విషయానికొస్తే ఫిబ్రవరి 7న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.. ఇందులో నాగచైతన్య సరసాన సాయిపల్లవి హీరోయిన్ గా చేస్తోంది. ఇక వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తుంది కాబట్టి అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి చూడాలి ఈ సినిమా నాగచైతన్య లైఫ్ ను నిలబెడుతుందా? లేదంటే పాత సినిమాల లాగే బోల్తా పడుతుందా అనేది మూడు రోజుల్లో బయటపడనుంది.(Nagarjuna)