Nagarjuna: ఆ హీరో మొహం చూసి మోసపోయా.. నరకం అనుభవించా..నాగార్జున షాకింగ్ కామెంట్స్.?
Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో నాగార్జున అంటే తెలియని వారు ఉండరు. అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత గీతాంజలి, శివ సినిమాలతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. అలాంటి నాగార్జున ప్రస్తుతం ఆరు పదుల వయసులో కూడా యంగ్ హీరోలా కనిపిస్తూ అద్భుతంగా సినిమాల్లో రాణిస్తున్నారు. అలాంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరో నాని గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు..
Nagarjuna shocking comments On that Hero
నాగార్జున నాని కాంబోలో దేవదాసు చిత్రం వచ్చిన విషయం అందరికీ తెలుసు. ఇందులో నానికి జంటగా రష్మిక మందాన నటించింది. నాగార్జునకు జంటగా ఆకాంక్ష సింగ్ నటించింది. అయితే ఈ చిత్రంలో నాని సెన్సిటివ్ డాక్టర్ పాత్రలో నటించగా నాగార్జున గ్యాంగ్ స్టార్ రోల్ లో అందరినీ ఆకట్టుకుంటారు. ఎన్నో అంచనాలతో వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది..(Nagarjuna)
Also Read: Mamitha Baiju:’ప్రేమలు’ హీరోయిన్ ని టార్చర్ చేసిన డైరెక్టర్.. దాని కోసం షూటింగ్లోనే.?
అయితే ఈ సినిమా గురించి ఒక ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ నానిపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ముందుగా స్టేజ్ పైకి ఎక్కిన నాని నాగ్ మనకు కనిపించేంత సాఫ్ట్ కాదని, నన్ను టార్చర్ చేశాడంటూ మాట్లాడారు. వెంటనే నవ్వుకున్న నాగార్జున మళ్లీ స్టేజ్ పైకి ఎక్కి ఏంటి నాని ఇప్పటిదాకా ఏం మాట్లాడావు నేను నిన్ను టార్చర్ చేశానా, నువ్వు నన్ను టార్చర్ పెట్టావా అంటూ సెటైర్ వేశారు.
నాని పైకి అంత సెన్సిటివ్ గా కనిపిస్తాడు కానీ ఆయనతో పూర్తిగా ట్రావెల్ చేస్తేనే నిజ స్వరూపం బయటపడుతుందన్నారు.ముందుగా నాని డీసెంట్ పేస్ అని నేను నమ్మాను. ఆ తర్వాతే నాకు నరకం కనిపించిందని సరదాగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఈవెంట్ లో ఒకరికొకరు కామెంట్స్ చేసుకోవడంతో ఈవెంట్ అంతా నవ్వులతో విరబూసింది. ప్రస్తుతం ఈ మాటలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Nagarjuna)