Nagarjuna: నయనతార పరువు తీసిన నాగార్జున.. అంత చీప్ క్యారెక్టర్ కాదు అంటూ.?
Nagarjuna: నాగార్జున నయనతార కాంబోలో గ్రీకువీరుడు,బాస్ వంటి సినిమాలు వచ్చాయి.. ఇక తను డిప్రెషన్ లో ఉన్న సమయంలో తనకి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో నాగార్జున తనని పిలిచి గ్రీకువీరుడు మూవీలో అవకాశం ఇచ్చారని నయనతార రీసెంట్గా చెప్పిన సంగతి మనకు తెలిసిందే. అలా ఎంతో మంచి సాన్నిహిత్య ఉన్న నయనతార నాగార్జున మధ్య తాజాగా ఒక చిచ్చు చెలరేగింది.
Nagarjuna who defamed Nayanthara
అదేంటంటే..నాగార్జున మాట్లాడిన మాటలు నయనతారకి పరోక్షంగా మంట పెట్టినట్లు ఉన్నాయి.మరి ఇంతకీ నాగార్జున ఏం మాట్లాడారు..అవి నయనతార కి పరోక్షంగా ఎలా రిలేట్ అయ్యాయి అనేది ఇప్పుడు చూద్దాం.. నాగార్జున రీసెంట్ గా తన పెద్దకొడుకు అక్కినేని నాగచైతన్య శోభిత దూళిపాళ్లకి సంబంధించిన పెళ్లి వీడియోని నెట్ఫ్లిక్స్ కి దాదాపు 50 కోట్లకు అమ్మేసినట్టు వచ్చిన వార్తల గురించి స్పందిస్తూ అక్కినేని ఫ్యామిలీ చాలా రిజర్వ్డ్ గా ఉంటుంది. (Nagarjuna)
Also Read: Rajinikanth: రజినీకాంత్ కి పిచ్చి పట్టిందా..టాబ్లెట్స్ లేకపోతే ఉండలేడా..?
ఇలాంటి చీప్ క్యారెక్టర్ ఉండదు. అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయాలైనా సరే చాలా గోప్యంగా ఉంచుతాం.అలాంటిది ఇలా డబ్బుల కోసం పెళ్లి వీడియోని ఎలా అమ్ముకుంటాం అని నాగార్జున తన స్నేహితులతో చెప్పారట. ఇక ఇదే విషయాన్ని నాగార్జున కుటుంబ సభ్యులు కూడా మీడియాతో మాట్లాడుతూ.. అలాంటి చీప్ క్యారెక్టర్ మా ఫ్యామిలీకి లేదు అంటూ ఆ విషయాన్ని కొట్టి పారేశారు.
అయితే నాగార్జున మాట్లాడిన మాటలు పరోక్షంగా నయనతారకి మంట పెట్టాయి.ఎందుకంటే నయనతార తన పెళ్లి వీడియోను నెట్ఫిక్స్ కి భారీ ధరకు అమ్ముకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక నాగార్జున కొడుకు పెళ్లి వీడియోని నెట్ఫిక్స్ కి అమ్ముకున్నాడు అనే వార్తలు రావడంతో ఇలాంటి క్యారెక్టర్ మాది కాదు అంటూ మాట్లాడడం పరోక్షంగా నయనతారకి చురకలు అంటించినట్లు ఉన్నాయి అని పలువురు నాగార్జున మాటలకు నయనతారను ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.(Nagarjuna)