Nandamuri Balakrishna: హిట్ యూనివర్స్‌లోకి బాలయ్య? తప్పు చేస్తున్నాడా?
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ కెరీర్ ప్రస్తుతం టాప్ గేర్‌లో ఉంది. వరుసగా నాలుగు సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న ఆయన లేటెస్ట్ ప్రాజెక్ట్స్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలయ్య “అఖండ 2: తాండవం” షూటింగ్‌లో బిజీగా ఉండగా, త్వరలోనే యంగ్ డైరెక్టర్లతో కొత్త సినిమాలపై పనిచేయనున్నారు.
Nandamuri Balakrishna in HIT Universe?
తాజాగా, బాలయ్య గురించి క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఆయన ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద క్రేజ్ ఉన్న సూపర్ హిట్ ఫ్రాంచైజ్ “హిట్ యూనివర్స్” లోకి అడుగుపెట్టబోతున్నారట. ఇప్పటికే ఈ యూనివర్స్‌లో విశ్వక్ సేన్, అడివి శేష్ నటించిన సినిమాలు ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. ఇప్పుడు మూడో పార్ట్ ను నాని చేస్తున్నాడు. ప్రతి సినిమా ముందు సినిమాను మించి ఉండడం ఈ సిరీస్ ప్రత్యేకత.
ఇప్పుడు నాలుగో పార్ట్‌కి బాలయ్యను ఫిక్స్ చేసినట్టుగా ఇండస్ట్రీలో గాసిప్ వినిపిస్తోంది. ఇది నిజమైతే, ఈ యూనివర్స్‌కు మాస్ యాంగిల్ అందిస్తారనడంలో సందేహం లేదు. బాలయ్య స్టైల్, మాస్ యాక్షన్ హిట్ యూనివర్స్‌లో చేరితే, అది ఒక మైలురాయి అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉన్నప్పటికీ, బాలయ్య లైనప్ మాత్రం ఓ రేంజ్‌లో ఉందని చెప్పొచ్చు. “అఖండ 2” తో పాటు ఇతర క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా బాలయ్యను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తాయి. అభిమానులు ఈ న్యూస్‌పై క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు.