Mokshagna: మోక్షజ్ఞ విషయంలో ఆ జ్యోతిష్యుడు చెప్పిందే కరెక్టా.. బాలకృష్ణ తప్పు చేస్తున్నారా.?

Mokshagna: నందమూరి మోక్షజ్ఞ విషయంలో బాలకృష్ణ నిజంగానే తప్పు చేస్తున్నారా.. ఆ జ్యోతిష్యుడు చెప్పినట్లు బాలకృష్ణ వినడం లేదా..ఇంతకీ కొడుకు విషయంలో బాలకృష్ణ చేస్తున్న తప్పేంటి అనేది ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఈ ఏడాది ఆ ఏడాది ఉండబోతుంది అంటూ ఎన్నో వినిపించినప్పటికీ ఇప్పటివరకు ఒక్క సినిమాతో అయినా కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వలేదు.
Nandamuri Mokshagna horoscope
అయితే ఆ మధ్యకాలంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుంది అని వార్తలు వినిపించినప్పటికీ ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ సినిమా ఆగిపోయినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అదంతా రూమర్లు మాత్రమే అని ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోనే మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా ఉంటుంది అని మరోసారి క్లారిటీ వచ్చింది. కానీ మళ్ళీ ఆ సినిమాకి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ కూడా లేదు..(Mokshagna)
Also Read: Kareena Kapoor: వారానికి 5 సార్లయినా కావాలి.. కరీనాకపూర్ హాట్ కామెంట్స్..?
ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రాబోయే సినిమాలో మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేశారు. కానీ ఇప్పటి వరకైతే దీనికి సంబంధించి అప్డేట్ లేదు.అయితే మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా విషయంలో ఇలా జరగడానికి కారణం ఆయన జాతకమేనట. బాలకృష్ణ తమ ఫ్యామిలీకి నమ్మకంగా ఉండే జ్యోతిష్యుడి కి తన కొడుకు జాతకం చూపించగా 2027 వరకు మోక్షజ్ఞ కి ఇండస్ట్రీ కలిసి రాదని చెప్పాడట.

కానీ ఆ జ్యోతిష్యుడు చెప్పినా కూడా వినకుండా అభిమానులు ఆగడం లేదనే ఉద్దేశంతో బాలకృష్ణ 2024 లోనే తన కొడుకుని సినిమాల్లోకి పరిచయం చేయాలి అనుకున్నారట.అయితే మోక్షజ్ఞ జాతకం ప్రకారం ఆయనకు సినీ ఇండస్ట్రీ 2027 లోనే కలిసి వస్తుంది కాబట్టి మోక్షజ్ఞ మొదటి సినిమాకి ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది.అలా బాలకృష్ణ ఆ జ్యోతిష్యుడి మాటలు వినకుండా మోక్షజ్ఞ సినిమా విషయంలో తప్పు చేస్తున్నారని తెలుస్తోంది.(Mokshagna)