Rahul Gandhi: యువతను అణిచివేస్తున్న మోదీ సర్కారుపై రాహుల్ ధ్వజం

Rahul Gandhi

ఢిల్లీలో జరిగిన తాజా పరిణామాల నేపథ్యంలో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ, ఈ ప్రభుత్వం youth ను అణిచివేస్తోందని తీవ్రంగా విమర్శించారు. సీజేపీ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం, టియర్ గ్యాస్ వాడటంతో ఆయన మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీ ఇష్యూలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాల్సిందేనని రాహుల్ డిమాండ్ చేశారు.

Youth Target Modi Government

దేశ చరిత్రలో యువతను ఇంతగా వ్యతిరేఖించిన ప్రధాని మోదీయే అని సోషల్ మీడియా పోస్ట్ లో రాహుల్ ఘాటుగా విమర్శించారు. విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా ఫెయిలైన ధర్మేంద్ర ప్రధాన్ ను కనీసం తన పదవి నుంచి తప్పుకోమని కూడా ప్రధాని అడగట్లేదని ఆయన అన్నారు. మొత్తం 152 సార్లు పేపర్లు లీక్ కాగా, దాదాపు 7.5 కోట్ల మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు. అయినా ఇప్పటి వరకు నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.

శ్రమించి చదివే విద్యార్థులే ఈ గేమ్ లో పెనాల్టీ కడుతున్నారు. వీళ్లు విద్యా వ్యవస్థపై ప్రశ్నిస్తే, బలగాలతో దాడి చేస్తున్నారు. పేపర్ లీక్ చేసిన క్రిమినల్స్ రోడ్డు మీద ఫ్రీగా తిరుగుతుంటే, ధర్నాలు చేస్తున్న పిల్లలను మాత్రం పోలీసులు లాఠీతో కొడుతున్నారు. ఈ ప్రభుత్వం కేవలం యువత ఫ్యూచర్ ను డ్యామేజ్ చేయడమే కాకుండా, వారి మీదనే ఫోర్స్ ను ప్రయోగిస్తోందని రాహుల్ విమర్శించారు.

ఇదే ఘటనపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ కూడా స్పందించారు. విద్యార్థులపై బలగాల్ని ప్రయోగించే ముందు తమ వైఖరిని, మనస్సాక్షిని సమీక్షించుకోవాలని కేంద్రానికి ఆమె సూచించారు. ప్రతి విషయంలోనూ తామే కేర్ తీసుకుంటామని చెప్పుకునే ప్రధాని, ఇన్ని పేపర్ లీకేజీలు ఎందుకు జరుగుతున్నాయో క్లారిటీ ఇవ్వాలని ప్రశ్నించారు. యంగ్స్టర్స్ ఆవేదనను ప్రధాని సీరియస్ గా విని తక్షణమే సమాధానం చెప్పాలని ప్రియాంక డిమాండ్ చేశారు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu