Nargis fakhri: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న పవన్ బ్యూటీ.. బయటపడ్డ ఫొటోస్.?
Nargis fakhri: ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్ హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీ వారిని కాకుండా వివిధ వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకొని ఓ ఇంటి వారు అవుతున్నారు.. ముఖ్యంగా సినీ నటులు అంటే ఇండస్ట్రీలో ఉండే వారిని పెళ్లి చేసుకుంటారని చాలామంది అనుకుంటారు. కానీ చాలామంది హీరోయిన్లు పెళ్లికి ముందే రిలేషన్స్ లో ఉండి వారితో లవ్ ట్రాక్ నడిపిస్తూ సినిమాల్లో చేసి ఓ స్థాయికి వచ్చిన తర్వాత పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడిపోతున్నారు.

Nargis fakhri married secretly Photos leaked
పెళ్లి తర్వాత కొంతమంది సినిమాల్లో నటిస్తుంటే మరి కొంతమంది ఇంటికి పరిమితం అవుతున్నారు. అలా తెలుగు, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీల్లో మోస్తారుగా గుర్తింపు పొందిన హీరోయిన్ నర్గీస్ తాజాగా పెళ్లి చేసుకుందని తెలుస్తోంది.. ఈమె రాక్ స్టార్ అనే మూవీ ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టి, పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. (Nargis fakhri)
Also Read: Sandeep Kishan: సందీప్ కిషన్ ఆ హీరోయిన్ చేతిలో మోసపోయాడా..లవ్ స్టోరీ వింటే.?
కేవలం బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ లో కూడా స్పై అనే సినిమాలో నటించింది..ఈ ముద్దుగుమ్మ తెలుగులో అమావాస్య సినిమాతో మన ముందుకు వచ్చింది.. ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న “హరహర వీరమల్లు”లో కూడా ఈ అమ్మడు చేయబోతుందని తెలుస్తోంది.. ఇంతకీ ముద్దుగుమ్మ పూర్తి పేరు ఏంటయ్యా అంటే నర్గీస్ ఫక్రి..ఈమె తన బాయ్ ఫ్రెండ్ ను తాజాగా పెళ్లి చేసుకున్నట్టు సమాచారం అందుతుంది.. లాస్ ఏంజిల్స్ లోని ఒక హోటల్లో నర్గిస్, టోనీ పెళ్లి చేసుకున్నారట..

అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించినటువంటి వెడ్డింగ్ కేక్ తో పాటు స్విట్జల్యాండ్ టూర్ లో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను ఆమె షేర్ చేసింది.. పెళ్లి చేసుకున్న తన భర్త టోనీ బేగ్ కాశ్మీర్ కుటుంబానికి చెందిన వ్యక్తట. పూర్వకాలం నుంచి వ్యాపారంలో రాణించడంతో అక్కడి నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారట.. అయితే నర్గీస్ కు టోనీతో చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉండడంతో అది కాస్త ప్రేమగా మారి, చివరికి పెళ్లి ద్వారా ఇద్దరు ఒకటయ్యారు.(Nargis fakhri)