Jr NTR: ఎన్టీఆర్ పెళ్లి ముచ్చట్లు చెప్పిన బావమరిది.. పెళ్లి చూపుల్లో అలా చేశారంటూ.?

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న సమయంలో పెళ్లి చూపుల సమయంలో ఆ ప్రశ్న అడిగారు ఈ ప్రశ్న అడిగాడు అంటూ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి ముచ్చట్లు చాలా సందర్భాల్లో వినిపించాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నటించిన మ్యాడ్-2 మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నార్నె నితిన్ కి ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి.
Narne Nithin intresting comments on Jr NTR
జూనియర్ ఎన్టీఆర్ మీతో ఎలా ఉంటారు ఆయనతో మీ బంధం ఎలా ఉంటుంది? బావమరిది బావ బంధంలా ఉంటారా ఫ్రెండ్స్ లా ఉంటారా మీ అక్కతో మీ బంధం ఏంటి అంటూ ఇలా ఎన్నో ప్రశ్నలు నార్నె నితిన్ కి ఎదురవుతున్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లిచూపుల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఏం ప్రశ్నలు అడిగారు అంటూ ఒక ప్రశ్న నార్నె నితిన్ కి ఎదురయ్యింది. (Jr NTR)
Also Read: Prabhas: బిజినెస్ మ్యాన్ కూతురితో ప్రభాస్ పెళ్లి నిజమే.. వైరల్ అవుతున్న ఫొటోస్.?
అయితే ఆ ప్రశ్నకి నార్నె నితిన్ ఆసక్తికర ఆన్సర్ చెప్పారు. మా బావ మా అక్కని పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చిన సమయంలో అసలు నేను ఇంట్లోనే లేను.ఎందుకంటే అప్పుడు నాది స్కూల్లో చదివే వయసు. అందుకే పెళ్లి చూపుల సమయంలో నేను ఇంట్లో ఉండలేదు. మా వాళ్ళు స్కూల్ కి పంపించేశారు. అలాగే నేను హీరో అవుదామని బావతో చెప్పిన సమయంలో నీకు ఇష్టం ఉంటే ఇండస్ట్రీ లోకి రా..

కానీ ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అని ఎన్టీఆర్ బావ నన్ను కూర్చోబెట్టుకొని మరీ చెప్పారు అంటూ నార్నె నితిన్ చెప్పుకొచ్చారు.ఇక మ్యాడ్-2 మూవీ మరికొద్ది గంటల్లో విడుదల కాబోతుండడంతో సినిమాపై అందరిలో ఒక ఎగ్జైటింగ్ అయితే ఉంది.(Jr NTR)