National Crush Rashmika: కుక్క బిస్కెట్ లు తిన్న రష్మిక..సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ హీరో!!
National Crush Rashmika: టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు, రష్మిక మందన తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ కెరీర్‌లో శిఖరాలకు చేరుకుంది. ఆమె దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుని, బాలీవుడ్‌లో కూడా హిట్ చిత్రాలను అందిస్తూ ముందు సాగుతుంది. గత ఏడాది విడుదలైన యానిమల్ సినిమా రష్మికకు పెద్ద విజయాన్ని అందించింది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ విజయం రష్మికను బాలీవుడ్‌లో మరింత బలంగా నిలబెట్టింది.
National Crush Rashmika Mandanna Fun Moments
అలాగే, అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. వరల్డ్‌వైడ్ రూ. 1700 కోట్ల మార్క్ దాటి, ఒక్క హిందీ భాషలోనే రూ. 700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ విజయం రష్మిక మందన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఆమెను పాన్-ఇండియా స్టార్‌గా నిలబెట్టటమే కాకుండా, ఆమె ఫేమ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది.
ఇదిలా ఉంటే, రష్మిక ప్రస్తుతం నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ సికిందర్. సల్మాన్ ఖాన్ సరసన ఆమె నటిస్తున్న ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. రంజాన్ కానుకగా 2025లో విడుదలవ్వబోయే ఈ చిత్రం మీద సల్మాన్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. పలువురు హీరోలకు లక్కీ చామ్‌గా నిలిచిన రష్మిక, సల్మాన్ ఖాన్‌కు కూడా సాలిడ్ హిట్ అందిస్తుందేమో చూడాలి. అలాగే, రష్మిక మరో రెండు లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ గర్ల్‌ఫ్రెండ్ మరియు రైన్‌బో చిత్రాల్లో కూడా నటిస్తోంది.
ఇక రష్మిక చేతిలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీటితో పాటు రష్మికకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం భీష్మ ప్రమోషనల్ ఈవెంట్‌లో బయటపడింది. నటుడు నితిన్ మాట్లాడుతూ, రష్మిక కుక్క బిస్కెట్లు తింటుందని సరదాగా తెలిపారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాయి.